Kajal Aggarwal: తన బాబు పిక్‌ను పోస్ట్ చేసిన కాజల్ అగర్వాల్
Kajal Aggarwal స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన బాబు పిక్‌ను పోస్ట్ చేశారు. ఇన్ స్టాలో కాజల్ అగర్వాల్ తల్లిగా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో పిక్ ద్వారా తెలిపారు. మథర్‌వుడ్ చాలా బాగుందంటూ కాజల్ అగర్వాల్ తెలిపారు.
టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగిన కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) రీసెంట్‌గా తల్లి అయ్యారు. కొడుకుకు నీల్ కిచ్లూతో ఫోటో దిగి అభిమానులకు షేర్ చేసుకున్నారు. కాజల్ అగర్వాల్ తన కొడుకును గుండెలపై పెట్టుకున్నారు. 2020లో గౌతమ్ కిచ్లు అనే వ్యాపారవేత్తను కాజల్ పెళ్లి చేసుకున్నారు. కాజల్ ఫోటోను చూసిన అభిమానులు సంతోషం పడుతున్నారు.
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కొడుకు పుట్టాక తొలి సారి మథర్స్‌డేను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తన కొడుకు తనకు ఎంతో ఆనందాన్ని పంచాడంటూ కాజల్ ఎమోషనల్ లెటర్ కూడా పోస్ట్ చేశారు. సూర్యచంద్రులు, నక్షత్రాలు.. ఈ విశ్వం అన్ని తన కొడుకేనంటూ కాజల్ అన్నారు.