టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున (Nagarjuna) హీరోగా నటించిన ది ఘోస్ట్ సినిమా ట్రైలర్‌‌పై రియాక్టైన కాజల్‌ అగర్వాల్

Updated on Aug 29, 2022 11:40 AM IST
టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున (Nagarjuna)  ది ఘోస్ట్ సినిమా ట్రైలర్‌‌పై రియాక్ట్‌ అయ్యారు హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal).
టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున (Nagarjuna) ది ఘోస్ట్ సినిమా ట్రైలర్‌‌పై రియాక్ట్‌ అయ్యారు హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal).

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున (Nagarjuna) హీరోగా నటించిన ది ఘోస్ట్ సినిమా ట్రైలర్‌‌పై రియాక్ట్‌ అయ్యారు హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). ది ఘోస్ట్‌ సినిమాలో కాజల్‌ హీరోయిన్‌గా సెలెక్ట్‌ అయ్యారు. అయితే  ప్రెగ్నెన్సీ కన్ఫమ్ కావడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నారు కాజల్.  అప్పటికే నాలుగు రోజులు షూటింగ్‌ కూడా పూర్తి చేశారని టాక్. 

కాజల్‌ ఆ క్యారెక్టర్‌‌ నుంచి తప్పుకోవడంతో నాగ్‌ పక్కన నటించడానికి సోనాల్ చౌహాన్‌ను ఎంపిక చేశారు.  తాజాగా ది ఘోస్ట్‌ ట్రైలర్‌‌పై కాజల్ అగర్వాల్ స్పందించారు. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.  అయితే మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకు కూడా రెడీ అవుతున్నారు.  పూర్తి ఫిట్‌గా  మళ్లీ తెరపైకి రావాలని ప్రయత్నిస్తున్నారు కాజల్.

 

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున (Nagarjuna) ది ఘోస్ట్ సినిమా ట్రైలర్‌‌పై రియాక్ట్‌ అయ్యారు హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal).

కొత్త జానర్‌‌లో..

దర్శకుడు ప్రవీణ్ సత్తారు ది ఘోస్ట్‌ సినిమాను కొత్త జానర్‌లో తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. మాఫియా, డ్రగ్స్, కిల్లింగ్, సస్పెన్స్  అన్నింటినీ కలిపి ది ఘోస్ట్ సినిమా తీసినట్టు అనిపిస్తోంది. నాగార్జున యాక్షన్, యాక్టింగ్ కొత్తగా అనిపిస్తున్నాయి. ట్రైలర్ అయితే అన్ని వర్గాల వారిని ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.  ఈ చిత్రం అక్టోబర్‌ 5న రాబోతోంది.

తాజాగా కాజల్ ది ఘోస్ట్ సినిమా ట్రైలర్‌‌ను షేర్ చేస్తూ చిత్ర యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్ చెప్పింది. దీంతో నెటిజన్లు కాజల్ మీద సరదా కామెంట్స్ చేస్తూ.. నాగార్జున హీరోగా నటించిన (Nagarjuna)ఈ సినిమా నువ్వు చేయాల్సింది కాజు పాప. ఇది నీ సినిమానే అంటున్నారు. ఒక మంచి సినిమాతో కమ్‌ బ్యాక్‌ ఇవ్వు అంటూ కాజల్‌ను (Kajal Aggarwal) కోరుతున్నారు.

Read More: Kajal & Tamannaah: పాపులర్ ఛాలెంజ్ 'షీ ఈజ్ ఏ 10' లో పాల్గొన్న కాజల్ అగర్వాల్, తమన్నా.. పోస్ట్ వైరల్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!