జూనియర్ ఎన్టీఆర్‌‌ (Junior NTR) సినిమా సెట్స్‌పైకి వెళ్లేది ఎప్పుడో? ఒత్తిడిలో కొరటాల శివ (Koratala Siva)!

Updated on Oct 15, 2022 03:39 PM IST
ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ తర్వాత ఎన్టీఆర్‌‌ (Junior NTR) కొరటాల శివ డైరెక్షన్‌లో సినిమా చేయనున్నట్టు ప్రకటించినా ఇప్పటివరకు షూటింగ్ స్టార్ట్‌ కాలేదు.
ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ తర్వాత ఎన్టీఆర్‌‌ (Junior NTR) కొరటాల శివ డైరెక్షన్‌లో సినిమా చేయనున్నట్టు ప్రకటించినా ఇప్పటివరకు షూటింగ్ స్టార్ట్‌ కాలేదు.

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా విడుదలై సూపర్‌‌హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), రాంచరణ్‌కు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా తర్వాత రాంచరణ్.. శంకర్ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక, ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. అయితే ఇంతకాలం గడుస్తున్నా ఆ సినిమా షూటింగ్ స్టార్ట్‌ కాలేదు. 

మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య ఫ్లాప్ అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆచార్య చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. ఈ సినిమా ఫలితంతో మెగా అభిమానులు, కొరటాల శివ  షాకయ్యారు. అంతేకాదు ఆచార్య సినిమాకు వచ్చిన నెగెటివ్‌ టాక్‌.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాపై పడే చాన్స్ ఉందని తారక్‌ అభిమానులు కూడా భయపడ్డారు.

అప్పటివరకు ఫ్లాప్ అంటే తెలియని కొరటాల శివ కెరీర్‌ను ఆచార్య సినిమా డైలమాలో పడేసింది.  ఆచార్య సినిమా  డిజాస్టర్‌‌తో  కొరటాల భవిష్యత్తు ప్రాజెక్టులపై మరింత శ్రద్ద పెడుతున్నారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్‌‌తో తెరకెక్కించే సినిమా కథలో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్‌‌కు పాన్‌ ఇండియా క్రేజ్ వచ్చింది. ఎన్టీఆర్‌‌30 సినిమా కథలో మార్పులు చేయడానికి అది కూడా ఒక కారణంగా తెలుస్తోంది.

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ తర్వాత ఎన్టీఆర్‌‌ (Junior NTR) కొరటాల శివ డైరెక్షన్‌లో సినిమా చేయనున్నట్టు ప్రకటించినా ఇప్పటివరకు షూటింగ్ స్టార్ట్‌ కాలేదు.

ఎప్పుడనే క్లారిటీ లేదు..

ఎన్టీఆర్‌‌తో సినిమా తెరకెక్కించనున్నట్టు ప్రకటన వచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు షూటింగ్ మొదలుకాలేదు. దీంతో కొరటాల శివపై ఒత్తిడి పెరిగిపోతోంది. సోషల్ మీడియాలో కూడా ఆయనపై ప్రెజర్ ఎక్కువవుతోంది. ఎన్టీఆర్ అభిమానులు ఆయనను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.  

ఇక, ఆచార్య సినిమా తర్వాత చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. గాడ్‌ఫాదర్‌‌ హిట్‌ కావడం కూడా కొరటాల శివకు తలనొప్పిగా మారిందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఆచార్య సినిమా ఫ్లాప్‌ కావడంపై మెగాస్టార్‌‌ ఇటీవల చేసిన కామెంట్లు కొరటాల శివ(Koratala Siva) పై ఒత్తిడిని మరింత పెంచినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) సినిమా సెట్స్‌పైకి వెళుతుందని ఎదురుచూసిన ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశలో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌‌ – కొరటాల శివ సినిమా షూటింగ్‌ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మరి.   

Read More : జూనియర్‌‌ ఎన్టీఆర్‌ (Junior NTR)‌ – కొరటాల శివ సినిమాలో హీరోయిన్‌గా నేషనల్‌ క్రష్‌ రష్మికా మందాన? నిజమెంతో

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!