కొరటాల శివ (Koratal Siva) - ఎన్టీఆర్ కాంబో 'NTR30' నుంచి అదిరిపోయే అప్డేట్.. నవంబర్ 12 నుంచి షూటింగ్ షురూ?

Updated on Oct 13, 2022 12:24 PM IST
ఈ సినిమాలో ఎన్టీఆర్ (NTR) లుక్ డిఫరెంట్ గా మరియు స్టన్నింగ్ గా, చాలా స్టైలిష్ గా ఉండబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో ఎన్టీఆర్ (NTR) లుక్ డిఫరెంట్ గా మరియు స్టన్నింగ్ గా, చాలా స్టైలిష్ గా ఉండబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Junior NTR)కు తన తర్వాతి సినిమా విషయంలో చాలా గ్యాప్ వచ్చింది. ఆ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు కొరటాల శివ కూడా 'ఆచార్య' సినిమా ఫ్లాప్ కారణంగా.. ఆ తరువాత చేయనున్న ఎన్టీఆర్ సినిమా విషయంలో కొంత సమయం తీసుకున్నాడు. 

అయితే కొరటాల (Koratal Siva)-ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఈ చిత్రంపై ప్రస్తుతం ఆసక్తికర టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం స్క్రిప్టింగ్ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది నవంబర్ 12వ తేదీ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే ఎన్నో మార్పులు, చర్చల తర్వాత ఎట్టకేలకు కొరటాల సినిమా కి ఎన్టీఆర్ స్క్రిప్ట్‌ను పూర్తి చేసాడని తెలుస్తోంది.

ఇక, ఈ సినిమాకి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ (Anirudh Ravichandran) సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. కథానాయికగా రష్మిక మందన్నా పేరు వినిపిస్తుండగా, అలాగే కీర్తి సురేష్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఓ కీలకమైన పాత్రలో విక్రమ్ కనిపించనున్నాడని అంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా మరోసారి కొరటాల-ఎన్టీఆర్ కాంబినేషన్ మూవీపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. షూటింగ్ కి ఇంకా సమయం ఉండగా మేకర్స్ అయితే ఇటీవల ప్రారంభమైనటువంటి అల్లు స్టూడియోస్ లో (Allu Studios) ఎన్టీఆర్ సినిమా సెట్ వర్క్స్ స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, కళ్యాణ్ రామ్ నిర్మాణంలోనే ఈ సినిమా తెరకెక్కబోతోంది. 

ఈ సినిమాలో ఎన్టీఆర్ (NTR) లుక్ డిఫరెంట్ గా మరియు స్టన్నింగ్ గా, చాలా స్టైలిష్ గా ఉండబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా బరువు తగ్గినట్లు సమాచారం. ఇక, ఈ చిత్రాన్ని 2023 వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Read More: Junior NTR: ఆహ్లాదకరమైన వాతావరణంలో భార్య లక్ష్మీ ప్రణతి (Lakshmi Pranathi) తో ఎన్టీఆర్.. ఫొటో వైరల్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!