Aadi : "ఆది" చిత్రం మళ్లీ రీ - రిలీజ్ అవుతుందట.. సంబరాల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ (ఈ సినిమా టాప్ 10 విశేషాలివే)

Updated on Sep 26, 2022 05:10 PM IST
ఆది (Aadi) సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో కొత్త రికార్డులను తిరగరాసింది. వి.వి. వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఆది (Aadi) సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో కొత్త రికార్డులను తిరగరాసింది. వి.వి. వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఆది.. (Aadi) జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆల్ టైమ్ బాక్సాఫీసు హిట్‌గా నిలిచిన సినిమా. ఈ చిత్రాన్ని మళ్లీ రీ రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన టాప్ టెన్ విశేషాలు మీకోసం 

నాలుగు నంది అవార్డులు
జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), వివి వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం నాలుగు నంది అవార్డులను కైవసం చేసుకోవడం విశేషం. ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా వివి వినాయక్, ఉత్తమ నటుడిగా (జ్యూరీ అవార్డు) ఎన్టీఆర్, ఉత్తమ ఎడిటర్‌గా గౌతంరాజు, ఉత్తమ గేయ రచయితగా చంద్రబోస్ అవార్డులు అందుకున్నారు.  ఈ సినిమా 2002 లో విడుదలైంది.

96 సెంటర్లలో 100 రోజులు
'ఆది' చిత్రం 96 సెంటర్లలో 100 రోజులు ప్రదర్శితమై, ఒక సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఆ రోజులలో ఎన్టీఆర్ లాంటి కొత్త నటుడికి ఆ స్థాయిలో కలెక్షన్లు లభించడం కూడా ఓ విధంగా రికార్డే. 

ఇతర భాషలలోకి రీమేక్
ఆది (Aadi) చిత్రం తమిళంలో 'జై' పేరుతో రీమేక్ అవ్వగా, బెంగాలీలో 'సూర్య' పేరుతో రీమేక్ అయ్యింది. 

తొలుత ఆర్తి అగర్వాల్‌ని కథానాయికగా అనుకున్నారట
'ఆది' చిత్రంలో హీరోయిన్‌గా తొలుత ఆర్తి అగర్వాల్‌ని అనుకున్నారట. అయితే ఆమె అప్పటికే 'నువ్వు నాకు నచ్చావ్' చిత్రానికి హీరోయిన్‌గా సైన్ చేయడంతో, డేట్స్ మ్యాచ్ కాలేదట. దీంతో కీర్తి చావ్లాకి కథానాయికగా అవకాశమిచ్చారు. 

నాగిరెడ్డి పాత్రలో మలయాళ నటుడు
ఈ చిత్రంలో విలన్ నాగిరెడ్డి పాత్రకు మంచి నటుడిని ఎంపిక చేయడం కోసం వినాయక్ శతవిధాలా ప్రయత్నించారట. ఆఖరికి ఆ అవకాశం మలయాళ నటుడు రాజన్ పి దేవ్‌ని (Rajan P Dev) వరించింది. 'ఆది' సినిమా విడుదలయ్యాక, రాజన్ తెలుగు సినిమాలలో విలన్‌గా చాలా పాత్రలు పోషించారు. ఆర్య, ఖుషీ, ఒక్కడు, దిల్, గుడుంబా శంకర్ లాంటి సినిమాలలో కూడా విలన్ పాత్రలు పోషించారు. 

నిర్మాతగా బెల్లంకొండ సురేష్
వినాయక్ తొలుత డైరెక్టర్ సాగర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసేవారట. అప్పుడే వినాయక్ వర్క్‌ను బాగా గమనించిన బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh), తప్పకుండా తనకు ఏదో ఒక సినిమాకి అవకాశం ఇస్తానని మాటిచ్చారట. ఆ మాట ప్రకారమే ఎన్టీఆర్ హీరోగా తాను చేయబోయే తదుపరి సినిమాకి దర్శకుడిగా సురేష్ వినాయక్‌కు అవకాశమివ్వడం విశేషం . 

కొత్త కమెడియన్ల కెరీర్‌కు ప్లస్ అయిన 'ఆది'
అప్పట్లో రఘు కారుమంచి, ఫిష్ వెంకట్, రఘుబాబు లాంటి కొత్త కమెడియన్లకు 'ఆది' సినిమా చాలా ప్లస్ అయ్యింది. రఘుబాబు (Raghu Babu) ఈ సినిమాలో నెగటివ్ రోల్‌లో కనిపించినా, ఆ తర్వాత విలన్ పాత్రలతో పాటు, కమెడియన్ పాత్రలు కూడా పోషించారు. 

పరుచూరి సంభాషణలు
ఊరమాస్ డైలాగ్స్‌కు 'ఆది' సినిమా పెట్టింది పేరు. ఈ సినిమాకు డైలాగ్స్ రాసిన పరుచూరి బ్రదర్స్ (Paruchuri Brothers), స్క్కిప్ట్ వర్క్ కూడా చాలా పకడ్బందీగా చేశారు. 

రికార్డు స్థాయి వసూళ్లు
కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన 'ఆది' చిత్రం.. రూ. 19 కోట్ల షేర్ వసూలు చేసింది. ఆ సంవత్సరం వచ్చిన చిత్రాలలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. 

దుమ్మురేపిన మణిశర్మ మ్యూజిక్
'ఆది' సినిమాకి మణిశర్మ (Mani Sharma) అందించిన మ్యూజిక్ మామూలుగా ఉండదు. మాస్, క్లాస్ సాంగ్స్‌‌‌కు సమపాళ్ళలో సంగీతాన్ని అందించారాయన. "తొలి పిలుపే తొలి పిలుపు", "నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగిందే" లాంటి పాటలు వ్రాసిన చంద్రబోస్ ఉత్తమ గేయరచయితగా నంది అవార్డు అందుకున్నారు. 

ఇవండీ.. "ఆది" సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు. ఈ సినిమా రీ రిలీజ్ వెర్షన్ కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం 

Read More: జూనియర్ ఎన్టీఆర్, జాన్వికపూర్ కాంబినేషన్‌లో తెలుగు సినిమా ? ఈ వార్త నిజమా .. రూమరా ?

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!