ఆమిర్‌‌ఖాన్‌ (Aamir Khan)పై కంగనా రనౌత్ (Kangana Ranaut) సంచలన కామెంట్లు.. మాస్టర్ మైండ్ అంటూ విమర్శలు !

Updated on Aug 06, 2022 02:18 PM IST
ఆమిర్‌‌ ఖాన్‌ (Aamir Khan) నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా మీద జరుగుతున్న నెగెటివ్ ప్రచారంపై కంగనా రనౌత్‌ (Kangana Ranaut)  కామెంట్లు వైరల్
ఆమిర్‌‌ ఖాన్‌ (Aamir Khan) నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా మీద జరుగుతున్న నెగెటివ్ ప్రచారంపై కంగనా రనౌత్‌ (Kangana Ranaut) కామెంట్లు వైరల్

బాలీవుడ్ మిస్టర్ ప‌ర్‌ఫెక్ట్ ఆమిర్‌ ఖాన్ (Aamir Khan) హీరోగా న‌టించిన కొత్త సినిమా ‘లాల్ సింగ్ చ‌డ్డా’. ఈ సినిమాలో నాగ చైత‌న్య కీల‌క‌పాత్రలో న‌టించారు. హాలీవుడ్‌లో సూప‌ర్ హిట్టైన ‘ది ఫారెస్ట్ గంప్‌’ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. అద్వైత్ చంద‌న్ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ సినిమా ఆగ‌స్టు 12వ తేదీన విడుద‌ల కానుంది.

ఈ క్రమంలో ‘లాల్ సింగ్ చ‌డ్డా’ సినిమాను బ‌హిష్కరించాలంటూ, కొన్నిరోజులుగా సోష‌ల్ మీడియాలో ప్రచారం జ‌రుగుతోంది.  దీనిపై ఇటీవ‌లే ఆమిర్ ఖాన్‌ కూడా స్పందించారు. తన సినిమాపై వ్యతిరేక ప్రచారం జరుగుతోందని.. దయచేసి ‘లాల్ సింగ్ చడ్డా‘ సినిమాను బహిష్కరించవద్దని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌ (Kangana Ranaut) ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఆలోచనలను పంచుకున్నారు. ఆ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్ అవుతోంది. తెలుగులో లాల్‌ సింగ్ చడ్డా సినిమాను మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు.

 

ఆమిర్‌‌ ఖాన్‌ (Aamir Khan) హీరోగా నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా మీద వస్తున్న నెగెటివ్ ప్రచారంపై కంగనా రనౌత్‌ (Kangana Ranaut)  కామెంట్లు వైరల్

మాస్టర్ మైండ్..

'ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘లాల్ సింగ్ చ‌డ్డా’ సినిమాపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారం వెనుక, ఆయన మాస్టర్ మైండ్ ఉంది. ఈ ఏడాది హిందీ సినిమాలు బాగా ఆడ‌లేదు. సౌత్ సినిమాలే ఇండియా కల్చర్‌‌కు అద్దం ప‌ట్టి స‌క్సెస్‌ అయ్యాయి. ఈ క్రమంలో ఒక హాలీవుడ్ రీమేక్ ఎలాగూ మంచి టాక్ తెచ్చుకునే చాన్స్ లేదు. హిందీ సినిమాలు ప్రేక్షకుల ప‌ల్స్‌ను అర్థం చేసుకోవాలి. ఇక్కడ హిందువు లేదా ముస్లిం అనే టాపిక్కే లేదు.

ఆమిర్‌‌ఖాన్ హిందూ ఫోబిక్ సినిమాగా ‘పీకే’ను తెరకెక్కించినా.. ఇండియాలో ‘అస‌హ‌నం ఎక్కువైంది‘ అని చెప్పినా అత‌ని సినిమాలు హిట్‌ అయ్యాయి. ఇప్పుడు దీనిని ఓ మ‌తానికి సంబంధించిన అంశంగా చిత్రీక‌రించ‌డం ఆపండి’ అంటూ ఆమిర్‌‌ ఖాన్‌పై (Aamir Khan) విమ‌ర్శలు చేశారు కంగనా రనౌత్ (Kangana Ranaut).

Read More : కేజీఎఫ్‌2 సినిమాపై బాలీవుడ్ స్టార్ ఆమిర్‌‌ఖాన్ (Aamir Khan) సెన్సేషనల్‌ కామెంట్స్‌..తన సినిమాపై నమ్మకం లేకేనా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!