నా శరీరం ఇంకా వణుకుతోంది.. సినిమా అంటే ‘కాంతార’ (Kantara)లా ఉండాలి: కంగనా రనౌత్ (Kangana Ranaut)

Updated on Oct 21, 2022 11:57 AM IST
‘కాంతార’ (Kantara) మూవీని చూశానని.. ఈ సినిమా నెక్స్ట్ లెవల్లో ఉందని బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) అన్నారు
‘కాంతార’ (Kantara) మూవీని చూశానని.. ఈ సినిమా నెక్స్ట్ లెవల్లో ఉందని బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) అన్నారు

కన్నడ సినిమా ‘కాంతార’ చేస్తున్న సంచలనాలు అంతాఇంతా కాదు. చిన్న చిత్రంగా రిలీజైన ‘కాంతార’.. పెద్ద సినిమాల కలెక్షన్లను దాటేస్తూ దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.175 కోట్ల వసూళ్లను సాధించిన ‘కాంతార’ మూవీ.. కన్నడ పరిశ్రమలో టాప్–3 గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచింది. తెలుగు బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ చిత్రం హవా మామూలుగా లేదు. తెలుగు నాట తొలి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కాంతార’.. ఇప్పుడు రూ.25 కోట్ల మార్కును చేరుకునే దిశగా పరుగులు తీస్తోంది. 

‘కాంతార’ మూవీ వసూళ్లతోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది. ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ‘కాంతార’ చిత్రం థ్రిల్లింగ్‌గా ఉందని అంటున్నారు. ఇది అద్భుతమైన చిత్రమంటూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రశంసలు కురిపిస్తే.. ఇది థియేటర్లలో ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిన మూవీ అని అనుష్క చెప్పుకొచ్చారు. ఇప్పుడు ‘కాంతార’ను మెచ్చుకునే వాళ్ల జాబితాలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ చేరిపోయారు. ఈ ఫిల్మ్‌ను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన హీరో రిషబ్ శెట్టికి హ్యాట్సాఫ్ అని కంగనా అన్నారు. 

ఇదో అద్భుతమైన అనుభవం

‘కాంతార’ చిత్రాన్ని తాజాగా వీక్షించిన కంగన.. సోషల్ మీడియా వేదికగా తన అనుభవాన్ని పంచుకుంటూ ఓ స్పెషల్ వీడియో షేర్ చేశారు. సినిమా అంటే ఎలా ఉండాలో ఈ మూవీ తెలియజేసిందని కంగన చెప్పారు. ‘ఫ్యామిలీతో కలసి ఇప్పుడే ‘కాంతార’ చూశా. ఇప్పటికీ నా శరీరం వణుకుతూనే ఉంది. ఇదో అద్భుతమైన అనుభవం. సాంప్రదాయం, జానపద కథలు, దేశీ సమస్యల సమ్మేళనంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. హీరో, దర్శకుడు రిషబ్ శెట్టికి నా హ్యాట్సాఫ్​. రచన, దర్శకత్వం, నటన.. అన్నీ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. ప్రకృతి అందాలను చూపించిన విధానం, యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉంది. సినిమా అంటే ఇది. ఇలాంటి చిత్రాన్ని థియేటర్‌లో తామెప్పుడూ చూడలేదని ఆడియెన్స్ అంటున్నారు. ఈ అత్యద్భుతమైన మూవీని అందించిన టీమ్‌కు ధన్యవాదాలు. మరో వారం రోజులపాటు నేను ఈ అనుభూతిలోనే ఉంటానని అనిపిస్తోంది’ అని కంగనా రనౌత్ పేర్కొన్నారు. 

ట్రెండింగ్‌లో ‘వరాహ రూపం’ సాంగ్

‘కాంతార’ మూవీలో అందర్నీ ఆకట్టుకున్న ‘వరాహ రూపం’ సాంగ్ గురువారం యూట్యూబ్‌లో రిలీజైంది. ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది. క్లైమాక్స్‌లో వచ్చే ఈ పాటను ఐదు రాత్రుల్లోనే తెరకెక్కించినట్టు చెప్పారు రిషబ్‌ శెట్టి. ‘వరాహ రూపం’ పాట షూట్ చేస్తున్నప్పుడు ఉపవాసం చేశానన్నారు. ఆ దేవుడే తమ వెంట ఉండి షూటింగ్‌ పూర్తి చేశారని అనుకుంటానని రిషబ్ శెట్టి పేర్కొన్నారు. ఇక, ‘కాంతార’లో రిషబ్ సరసన కథానాయికగా సప్తమి గౌడ నటించారు. సీనియర్ నటులు కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్‌ శెట్టి కీలక పాత్రలు పోషించారు.

Read more: ప్రతి పాత్ర పైనా అది రాసి ఉంటుంది.. సినిమా ఫలితం కాదు, నాకు ప్రయాణమే ముఖ్యం: సాయి పల్లవి (Sai Pallavi)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!