ఈరోజు సాయంత్రం సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) సినిమా నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్‌..ఫ్యాన్స్‌ వెయిటింగ్

Updated on Aug 18, 2022 02:09 PM IST
సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ కాంబినేషన్‌ సినిమా అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు
సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ కాంబినేషన్‌ సినిమా అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా కథ, టైటిల్‌ విషయంలో చాలా రూమర్స్‌ ఇండస్ట్రీలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్‌తో రెండు సినిమాలు చేసిన మహేష్‌.. మూడో సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే ఎప్పుడు ఏ అప్‌డేట్స్ వస్తాయా అని అభిమానులు, సినీ ప్రేమికులు ఎదురుచూస్తుంటారు. అటువంటి క్రేజీ అప్‌డేట్‌ ఇప్పుడు బయటికి వచ్చింది. ఈ రోజు సాయంత్రం మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ సినిమా నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్‌ ప్రకటించనున్నట్టు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఇంకేముంది ఈ వార్త వచ్చినప్పటి నుంచి ప్రిన్స్ ఫ్యాన్స్‌ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అయితే ఆ బ్లాస్టింగ్‌ అప్‌డేట్‌ ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ కాంబినేషన్‌ సినిమా అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు

ట్విట్టర్‌‌లో ట్రెండింగ్..

ఆ బ్లాస్టింగ్ అప్‌డేట్‌ వచ్చే వరకు దాని గురించి వేచి ఉండాల్సిందే మరి. ఈ క్రమంలో మహేష్‌బాబు ఫ్యాన్స్‌ #SSMB28 హ్యాష్‌ట్యాగ్‌ ట్విట్టర్‌‌లో ట్రెండింగ్ అవుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్‌బాబు (MaheshBabu) సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎస్‌ఎస్‌ థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌‌పై రాధా కృష్ణ  నిర్మిస్తున్నారు.

Read More : లీడర్ సినిమా సీక్వెల్‌లో మహేష్‌బాబు (MaheshBabu) నటించనున్నారా? శేఖర్ కమ్ముల కథకు సూపర్‌‌స్టార్ ఓకే చెబుతారా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!