మ‌హేష్ బాబు (Mahesh Babu) త‌ల్లి ఇందిరా దేవికి సినీ ప్రముఖుల నివాళి !

Updated on Sep 28, 2022 03:58 PM IST
ట్విట్ట‌ర్ వేదిక‌గా ప‌లువురు టాలీవుడ్ ప్ర‌ముఖులు మ‌హేష్ బాబు (Mahesh Babu) కుటుంబానికి సంతాపాన్ని ప్ర‌క‌టించారు. 
ట్విట్ట‌ర్ వేదిక‌గా ప‌లువురు టాలీవుడ్ ప్ర‌ముఖులు మ‌హేష్ బాబు (Mahesh Babu) కుటుంబానికి సంతాపాన్ని ప్ర‌క‌టించారు. 

టాలీవుడ్ సూపర్ స్టార్  మ‌హేష్ బాబు (Mahesh Babu) కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ రోజు ఉదయం మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. 70 ఏళ్ల ఇందిరా దేవి కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. హైద‌రాబాద్‌లోని ఏఐజీ ఆస్ప‌త్రిలో ఉద‌యం 4 గంట‌ల‌కు ఆమె తుది శ్వాస విడిచారు. మ‌హేష్ బాబు త‌ల్లి ఇందిరాదేవి పార్థివ దేహానికి ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు.  ఇదే క్రమంలో ట్విట్ట‌ర్ వేదిక‌గా మ‌హేష్ బాబు కుటుంబానికి సంతాపాన్ని ప్ర‌క‌టించారు. 

సినీ ప్ర‌ముఖుల నివాళులు
టాలీవుడ్ నటుడు మ‌హేష్ బాబు  (Mahesh Babu) తన త‌ల్లి ఇందిరా దేవి మృతి ప‌ట్ల తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు.  మెగాస్టార్ చిరంజీవి కూడా ఇందిరా దేవి మ‌ర‌ణం పట్ల తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. "సూపర్ స్టార్ కృష్ణ గారికి ,నా సోదరుడు మహేష్ బాబుకు  ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని" ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

టాలీవుడ్ ప్ర‌ముఖులు నాగార్జున‌, ఎన్టీఆర్, రానా, త‌మ‌న్, బెల్లంకొండ శ్రీనివాస్, రోజా సెల్వ‌మ‌ణి, ర‌వితేజ‌, ర‌ఘు కుంచె మొదలైనవారు.. సొషల్ మీడియా వేదికగా ఇందిరాదేవికి నివాళులు అర్పించారు. ట్విట్ట‌ర్‌లో మ‌హేష్ బాబు కుటుంబానికి సంతాపం తెలిపారు.  

Read More: నాన‌మ్మ కోసం ఎక్కి ఎక్కి ఏడుస్తోన్న సితార (Sitara Ghattamaneni).. సితార‌ను ఓదార్చిన మ‌హేష్ (Mahesh Babu)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!