ఇండియన్‌2 సెట్స్‌లో కమల్‌ హాసన్‌ (Kamal Haasan) చేసిన పనికి షాకైన చిత్ర యూనిట్.. సింగిల్‌ టేక్‌లో డైలాగ్‌

Updated on Sep 15, 2022 09:52 PM IST
లోకనాయకుడు కమల్ హాసన్‌ (Kamal Haasan) నటించిన విక్రమ్‌ సినిమా రికార్డులను తిరగరాసింది. ప్రస్తుతం కమల్‌ ఇండియన్‌2 సినిమాలో నటిస్తున్నారు
లోకనాయకుడు కమల్ హాసన్‌ (Kamal Haasan) నటించిన విక్రమ్‌ సినిమా రికార్డులను తిరగరాసింది. ప్రస్తుతం కమల్‌ ఇండియన్‌2 సినిమాలో నటిస్తున్నారు

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) సినిమాల్లో ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. నటనతోనే కాదు.. తన సినిమాల్లో వైవిద్యం కోసం కమల్‌ చాలా రకాలుగా తపిస్తుంటారు. ఈ క్రమంలోనే కమల్‌ విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లో గెటప్స్, వాయిస్, డైలాగ్స్ ఇలా అన్నింటిలో వైవిద్యాన్ని చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు కమల్‌ హాసన్.

చాలాకాలం నుంచి కమల్‌ తన రేంజ్ హిట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన నిరీక్షణ ‘విక్రమ్’ సినిమాతో తీరిపోయింది. విక్రమ్ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్‌‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం కమల్‌ హాసన్ ఇండియన్‌2 సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. శంకర్‌‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా ఇండియన్‌2 సినిమా తెరకెక్కుతోంది.

లోకనాయకుడు కమల్ హాసన్‌ (Kamal Haasan) నటించిన విక్రమ్‌ సినిమా రికార్డులను తిరగరాసింది. ప్రస్తుతం కమల్‌ ఇండియన్‌2 సినిమాలో నటిస్తున్నారు

సింగిల్‌ టేక్‌లో..

ఇండియన్‌2 సినిమాలో కమల్‌ హాసన్ ఇప్పటివరకు ఎవరూ చేయని ప్రయోగం చేశారని టాక్. కోలీవుడ్‌ టాక్ ప్రకారం.. ఇండియన్‌2 సినిమాలో 10 నిమిషాలపాటు డైలాగ్‌ చెప్పే సీన్‌ ఒకటి ఉంటుందట. దాని కోసం కమల్ హాసన్ 14 భాషల్లో మాట్లాడారని సమాచారం. అది కూడా సింగిల్‌ టేక్‌లోనే చేసి అందరినీ షాక్‌కు గురిచేశారట కమల్‌.  ప్రస్తుతం ఈ వార్త నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

ఇండియన్‌2 సినిమాలో కమల్‌ హాసన్ సరసన కాజల్‌ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాబీ సింహా, సిద్దార్ధ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని కీలకపాత్రలు పోషిస్తున్నారు.  లైకా ప్రొడ‌క్షన్స్,-రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై ఉద‌య‌నిధి స్టాలిన్‌, -సుభాస్కర‌న్ సంయుక్తంగా ఇండియన్‌2 చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన కమల్‌ హాసన్‌ (Kamal Haasan) ఫస్ట్‌లుక్‌ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేసింది.

Read More : రికార్డులు సృష్టిస్తున్న కమల్ హాసన్(Kamal Haasan) ‘విక్రమ్’ మూవీ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!