రికార్డులు సృష్టిస్తున్న కమల్ హాసన్(Kamal Haasan) ‘విక్రమ్’ మూవీ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్!

Updated on Aug 26, 2022 06:12 PM IST
కమల్‌ హాసన్ (Kamal Haasan) విక్రమ్‌ సినిమా రిలీజై రికార్టులు సృష్టించింది
కమల్‌ హాసన్ (Kamal Haasan) విక్రమ్‌ సినిమా రిలీజై రికార్టులు సృష్టించింది

లోకనాయకుడు కమల్​ హాసన్​(Kamal Haasan)​ నటించిన విక్రమ్​ సినిమా అంచనాలను మించి బాక్సాఫీస్​ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. సినిమానే కాదు ప్రస్తుతం ఈ సినిమా బ్యాక్​గ్రౌండ్​ స్కోర్​ కూడా రికార్డులు సృష్టిస్తోంది.  ఈ సినిమాలో కంటెంట్ కి, అందులో నటించిన నటీనటుల నటనకి ఎంత రెస్పాన్స్ వచ్చిందో... బిజిఎమ్‌కి అంతకు మించిన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న బిజిఎమ్ విక్రమ్ సినిమాదే. కమల్ హాసన్ ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమాకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించగా... రాజ్‌కమల్ ఫిల్మ్స్ నిర్మించింది. అనిరుధ్‌ రవిచంద్రన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు.

అనిరుధ్‌ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి సంబంధించిన 37 నిమిషాల బిజిఎమ్‌ను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేసింది మూవీ టీమ్. ఇందులో అమర్ థీమ్, సంధనం థీమ్, అమర్ గాయత్రి మధ్య ఒక బిజిఎమ్.. వాట్స్ కుకింగ్, మార్నింగ్ థీమ్, మ్యారేజ్ ఎట్ 2ఏఎమ్, వెడ్డింగ్ పార్టీ, పబ్లొ సంధనం, ఏజెంట్ విక్రం, గోస్ట్ అన్ మాస్కెడ్, ది డిల్లి కనెక్ట్, ది విక్రం స్క్వాడ్, షీల్డ్ ఫైట్ - వన్స్ అపాన్ ఏ టైమ్, ప్రబంజన్ థీమ్, ది నేమ్ ఈజ్ విక్రమ్, ఏజెంట్ టీనా, సౌండ్ ఆఫ్ విక్రమ్, పొర్కంద సింగం, విక్రమ్ వర్సెస్ సంధనం, లోకివర్స్, రోలెక్స్ థీమ్... ఇలా మొత్తం 21 బీజీఎమ్స్ ఉన్నాయి. ఇందులో కమల్ హాసన్ పై వచ్చే విక్రమ్ షీల్డ్ ఫైట్ - వన్స్ అపాన్ ఏ టైమ్ తో పాటు... సినిమా ఎండింగ్ లో సూర్య ఎంట్రీ ఇచ్చినప్పుడు వచ్చే రోలెక్స్ బిజిఎమ్ మంచి రెస్పాన్స్ వస్తోంది.

కమల్‌ హాసన్ (Kamal Haasan) విక్రమ్‌ సినిమా రిలీజై రికార్టులు సృష్టించింది

నెలరోజుల్లో మిలియన్లలో వ్యూస్​..

యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన నెలరోజుల్లోనే 6.8 మిలియన్ వ్యూస్ వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు. విక్రమ్ బిజిఎమ్ కి యూత్ ని నుంచి ఎంత రెస్పాన్స్ వస్తోందో. ఇక స్కూల్ పిల్లల నుంచి కాలేజ్ కుర్రాళ్ల వరకు... సెల్ ఫోన్ రింగ్ టోన్స్ అదే. కాలర్ టోన్స్ అదే. దీంతో పాటు సోషల్ మీడియాలు తాము పెట్టే ఫోటోలకి, వీడియోలకి ఇదే విక్రమ్, రోలెక్స్ బిజిఎమ్ లని యాడ్ చేస్తున్నారు.

ప్రస్తుతం విక్రమ్ బిజిఎమ్ కి ఎంత డిమాండ్ ఉంది ఉంటే... పబ్ లలోను స్పెషల్ అకేషన్స్ టైమ్ లో విక్రమ్, రోలెక్స్ బిజిఎమ్ లని ప్లే చేయించుకుంటున్నారు. ఇందులో ఎక్కువ శాతం అమ్మాయిలే ఉండటం మరో విశేషం. మనదగ్గర ఒక బిజిఎమ్ కి ఇంత రెస్పాన్స్ రావడం చాలా అరుదు. కేజీఎఫ్ తర్వాత ఆ రికార్డ్ ని క్రేయేట్ చేస్తున్న బిజిఎమ్ కమల్​ హాసన్​(Kamal Haasan) నటించిన విక్రమ్ మూవీదే కావడం విశేషం

Read More : కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా నటిస్తున్న ఇండియన్‌2 సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ చేయనున్న శంకర్‌‌!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!