Raghava Lawrence Birthday Special : మెరుపై సాగిన నటరాజు.. సేవా దృక్పథంలో మహారాజు !

Updated on Oct 29, 2022 02:26 PM IST
తన నటనతో, డాన్సులతో ప్రేక్షకులకు వినోదం పంచడంతో పాటు రాఘవ లారెన్స్  (Raghava Lawrence) పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
తన నటనతో, డాన్సులతో ప్రేక్షకులకు వినోదం పంచడంతో పాటు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

దక్షిణాది సినిమా రంగంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) డాన్సర్‌గానే కాకుండా నటుడిగా, దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నృత్య దర్శకుడిగా 4 ఫిలిం ఫేర్ అవార్డులు, 3 నంది పురస్కారాలు కైవసం చేసుకున్నారు.

'మాస్' అనే సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి దర్శకుడిగా అడుగుపెట్టారు.  తన నటనతో, డాన్సులతో ప్రేక్షకులకు వినోదం పంచడంతో పాటు రాఘవ లారెన్స్ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించారు. అంతేకాకుండా అనాథలకు ఆశ్రయం ఇస్తున్నారు. ఈ రోజు రాఘవ లారెన్స్ పుట్టిన రోజు సందర్భంగా పింక్ విల్లా ప్రత్యేక కథనం మీకోసం.. 

తన నటనతో, డాన్సులతో ప్రేక్షకులకు వినోదం పంచడంతో పాటు రాఘవ లారెన్స్  (Raghava Lawrence) పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

అట్టడుగు స్థాయి నుండి అద్భుత విజయాల వైపు..
రాఘవ లారెన్స్  (Raghava Lawrence) 1976 అక్టోబరు 29 తేదిన తమిళనాడులో జన్మించారు. తన కెరీర్ తొలినాళ్ళలో తమిళ ఫైట్ మాస్టర్ సూపర్ సుబ్బరాయన్‌కి కార్ క్లీనర్‌గా పనిచేసేవారు. లారెన్స్‌కు చిన్ననాటి నుంచి డాన్స్ అంటే ప్రాణం. అతని ప్రతిభ గుర్తించిన సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ (Rajinikanth)  లారెన్స్ డాన్స్ యానియన్‌లో చేరడానికి సహాయం చేశారు. 

తన నటనతో, డాన్సులతో ప్రేక్షకులకు వినోదం పంచడంతో పాటు రాఘవ లారెన్స్  (Raghava Lawrence) పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

చిరంజీవి తాను హీరోగా నటించిన 'హిట్లర్' సినిమాలో రాఘవ లారెన్స్‌కు కొరియోగ్రాఫర్‌గా తెలుగులో అవకాశం ఇచ్చారు. ఆ చిత్రంలో లారెన్స్ స్టెప్పులకు ఫిదా అయిన చిరంజీవి 'మాస్టర్' సినిమాలో కూడా అవకాశం కల్సించారు. 

తన నటనతో, డాన్సులతో ప్రేక్షకులకు వినోదం పంచడంతో పాటు రాఘవ లారెన్స్  (Raghava Lawrence) పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

బహుముఖ పాత్రలు
లారెన్స్ 1991 లో రిలీజ్ అయిన  'దొంగ పోలీస్' సినిమాలో ఒక పాటలో ప్రభుదేవాతో కలిసి నటించారు. అలాగే దర్శకుడు శంకర్ తెరకెక్కించిన 'జెంటిల్ మన్' సినిమాలో హిట్ సాంగ్ 'చికుబుకు చికుబుకు రైలే'లో డాన్సర్‌గా కనిపించారు.  

ముఠా మేస్త్రి, రక్షణ, అల్లరి ప్రియుడు సినిమాల్లోని పాటల్లో రాఘవ లారెన్స్ హీరో వెనుక డాన్సర్లలో ఒకరిగా నటించారు. మాస్, స్టైల్, ముని, డాన్, కాంచన, రెబెల్, గంగ మొదలైన  సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. 

తన నటనతో, డాన్సులతో ప్రేక్షకులకు వినోదం పంచడంతో పాటు రాఘవ లారెన్స్  (Raghava Lawrence) పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

కొరియోగ్రాఫర్‌గానే కాకుండా హీరోగా, దర్శకుడిగా కూడా లారెన్స్ సినిమాల్లో తన సత్తా ఏంటో చూపించారు. స్పీడ్ డాన్సర్, స్టైల్ వంటి తెలుగు సినిమాల్లో హీరోగా నటించారు. అంతేకాకుండా పార్థేన్ రాజితేణ్, అర్పుధాం, పాండి, రాజాధిరాజా వంటి తమిళ సినిమాలలో నటించారు. 

రాఘవ లారెన్స్‌ (Raghava Lawrence)కు 'కాంచన' సినిమా మరింత గుర్తింపు తెచ్చింది. దర్శకుడు కె.బాలచందర్ తన 100వ సినిమా 'పార్థాలే పరవశం'లో  లారెన్స్‌కు అవకాశం ఇచ్చారు. ఈ సినిమా లారెన్స్‌కు మంచి విజయం తెచ్చిపెట్టింది.

తన నటనతో, డాన్సులతో ప్రేక్షకులకు వినోదం పంచడంతో పాటు రాఘవ లారెన్స్  (Raghava Lawrence) పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

పురస్కారాలు
అన్నయ్య, పార్థాలే పరవశం, ఇంద్ర, స్టైల్ సినిమాలకు కొరియోగ్రఫీ అందించిన రాఘవ లారెన్స్‌కు ఆ చిత్రాలకు గాను ఉత్తమ నృత్య దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డ్స్ లభించాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే నంది అవార్డులను కూడా అందుకున్నారు. అన్నయ్య, ఇంద్ర, స్టైల్ సినిమాలోని పాటలకు కూడా నృత్య దర్శకత్వం వహించినందుకు నంది అవార్డులు కైవసం చేసుకున్నారు. అంతేకాకుండా ఎడిసన్ అవార్డ్, మణిధనేయం పురస్కారాలను రాఘవ లారెన్స్ కైవసం చేసుకున్నారు. 

తన నటనతో, డాన్సులతో ప్రేక్షకులకు వినోదం పంచడంతో పాటు రాఘవ లారెన్స్  (Raghava Lawrence) పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

సామాజిక సేవ
2015 లో భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణించిన తరువాత ఆయన పేరుతో లారెన్స్ ఒక సేవా సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సేవా సంస్థ ఏర్పాటుకు గాను కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. లారెన్స్  తన పరిధిలో ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు.

తన నటనతో, డాన్సులతో ప్రేక్షకులకు వినోదం పంచడంతో పాటు రాఘవ లారెన్స్  (Raghava Lawrence) పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

నిరుపేద చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయిస్తున్నారు. అంతేకాకుండా ఎంతోమంది అనాథలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలో కూడా హీరో అనిపించుకుంటున్నారు లారెన్స్. రాఘవ లారెన్స్ ప్రస్తుతం రజనీకాంత్ నటించిన 'చంద్రముఖి' సినిమా సీక్వెల్‌లో హీరోగా నటిస్తున్నారు.

Read More: Chandramukhi 2: చంద్రముఖి 2 మొద‌లు ! రాఘ‌వ లారెన్స్ ర‌జ‌నీకాంత్ (Rajinikanth) ఆశీర్వాదం ఎందుకు తీసుకున్నారు?

తన నటనతో, డాన్సులతో ప్రేక్షకులకు వినోదం పంచడంతో పాటు రాఘవ లారెన్స్  (Raghava Lawrence) పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

తన ప్రతిభతో ఎంతో మందికి చేయుతను అందిస్తున్న లారెన్స్ ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటూ..  హ్యాపీ బర్త్ డే రాఘవ లారెన్స్
పింక్ విల్లా
 
Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!