Amitabh Bachchan: అమితాబ్ బ‌చ్చ‌న్ బ‌ర్త్ డే స్పెష‌ల్ : భాషలకు అతీతంగా ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన మేటి నటుడు బిగ్ బి

Updated on Oct 13, 2022 01:03 PM IST
అమితాబ్‌ బచ్చ‌న్‌ (Amitabh Bachchan)ను ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ 'బిగ్ బి' అని అభిమానంగా పిలుచుకుంటారు.
అమితాబ్‌ బచ్చ‌న్‌ (Amitabh Bachchan)ను ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ 'బిగ్ బి' అని అభిమానంగా పిలుచుకుంటారు.

భార‌తీయ సినీ రంగంలో అమితాబ్ బచ్చ‌న్‌ (Amitabh Bachchan)కు ఓ ప్ర‌త్యేక స్థానం ఉంది. నార్త్ ఇండియాలోనే కాకుండా సౌత్ ఇండియాలోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఎంతో మంది హీరోల‌కు సైతం అభిమాన హీరో అమితాబ్ బ‌చ్చ‌న్. అమితాబ్ బ‌చ్చ‌న్ పోషించిన ప్ర‌తీ పాత్ర‌ ప్రేక్ష‌కుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

అమితాబ్ దాదాపు 193 చిత్రాల‌లో నటించారు.  బుల్లితెర‌పై "కౌన్ బనేగా కరోడ్ పతి" లాంటి ప్రతిష్టాత్మకమైన షోతో కోట్ల మంది అభిమానుల‌ను సైతం సంపాదించుకున్నారు. అందుకే ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ అమితాబ్‌ను "బిగ్ బి"గా ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది.

"బిగ్ బి" అమితాబ్ బ‌చ్చ‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా పింక్ విల్లా ప్ర‌త్యేక క‌థ‌నం మీకోసం. 

అమితాబ్‌ బచ్చ‌న్‌ (Amitabh Bachchan)ను ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ 'బిగ్ బి' అని అభిమానంగా పిలుచుకుంటారు.

బాల్యం
ఉత్తర్ ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో అమితాబ్ బ‌చ్చ‌న్ జన్మించారు. వీరి పూర్వీకులు  ప్ర‌తాప్‌ఘడ్ జిల్లా బ‌బుప‌ట్టి గ్రామానికి చెందిన‌వారు. అమితాబ్ తండ్రి హరివంశ్ రాయ్ శ్రీవాస్తవ (బచ్చన్)  ప్ర‌ముఖ హిందీ క‌వి. త‌ల్లి తేజి బచ్చన్. ఈమె సిక్కు కుటుంబానికి చెందిన వారు. అమితాబ్ తండ్రి క‌విగా ఎన్నో  సంకలనాలను వెలువరించారు. అలాగే ఎన్నో పుస్త‌కాలు ర‌చించారు. ఆయ‌న క‌లం పేరు బ‌చ్చ‌న్. 

క‌లం పేరే ఇంటిపేరు
అమితాబ్‌ తండ్రి హరివంశ్ రాయ్ తొలుత తన బిడ్డకు  "ఇంక్విలాబ్" అంటూ నామకరణం చేశారు. 

ఆ త‌రువాత స్నేహితుడి సూచ‌న మేర‌కు, అదే పేరును "అమితాబ్" అని మార్చారు.  ఇంటిపేరు శ్రీవాస్తవ అయినా తండ్రి క‌లం పేరు బ‌చ్చ‌న్‌ను ఇంటి పేరుగా మార్చుకున్నారు అమితాబ్. అమితాబ్ అస‌లు పేరు అమితాబ్ హరివంశ్ రాయ్ బచ్చన్. 

అమితాబ్‌ బచ్చ‌న్‌ (Amitabh Bachchan)ను ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ 'బిగ్ బి' అని అభిమానంగా పిలుచుకుంటారు.

సినిమా ఎంట్రీ
అమితాబ్ ఢిల్లీ విశ్వ‌విదాల‌యానికి చెందిన కిరోరిమ‌ల్ కళాశాల‌లో బీఎస్సీ పూర్తి చేశారు. ఈయన  త‌ల్లి నాట‌కాల్లో న‌టించేవారు. దీంతో అమితాబ్ కూడా న‌ట‌న‌పై ఆస‌క్తి పెంచుకున్నారు. కలకత్తాలోని ‘బర్డ్ అండ్ కో’ అనే షిప్పింగ్ కంపెనీలో మెటీరియల్ బ్రోకర్‌గా అమితాబ్ పనిచేసేవారు. ఆ తర్వాత న‌ట‌న‌పై ఇష్టంతో.. తల్లి ప్రోత్సాహంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

సినీ ప్ర‌యాణం
అమితాబ్ 1969లో "భువన్ షోమ్" అనే సినిమాలో వాయిస్ ఓవ‌ర్ అందించారు. ఈ సినిమా తీసిన ద‌ర్శ‌కుడు మృణాల్ సేన్, అదే చిత్రానికి గాను జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత నటునిగా అమితాబ్‌ "సాత్ హిందుస్తానీ"లో న‌టించారు. ఆ సినిమాకు ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో గల ఏడు ప్రధానపాత్రల్లో, తాను కూడా ఒక్కడిగా న‌టించారు అమితాబ్.

ఆనంద్" అమితాబ్ బ‌చ్చ‌న్ నటించిన రెండ‌వ సినిమా. ఆ తర్వాత "పర్వానా"లో విల‌న్ పాత్ర‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. మ‌రోవైపు "గుడ్డీ" సినిమాలో ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించారు. ఆ తర్వాత బాంబే టు గోవా,  జంజీర్, లావారిస్, కాలా పత్తర్, దీవార్, షోలే, హమ్ వంటి సినిమాలతో స్టార్ హీరో అయ్యారు. 

అమితాబ్‌ బచ్చ‌న్‌ (Amitabh Bachchan)ను ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ 'బిగ్ బి' అని అభిమానంగా పిలుచుకుంటారు.

జ‌య బాధురితో పెళ్లి
జయ బాధురిని "పుణె టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా"లో అమితాబ్ తొలిసారి కలిశారు. ఆ తర్వాత ‘గుడ్డి’ సినిమా సెట్‌లో రెండోసారి చూశారు. 1973లో విడుద‌లైన "జంజీర్" సినిమాలో జ‌యాతో క‌లిసి న‌టించారు. ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే వీరిరువురి మ‌ధ్య ప్రేమ చిగురించింది. అదే సంవ‌త్స‌రంలో వీరు పెళ్లి చేసుకున్నారు. "అభిమాన్" చిత్రం వీరి వివాహం అయిన నెల తరువాత విడుదలై విజయం  సాధించింది. అమితాబ్, జ‌యా బ‌చ్చ‌న్‌ల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు. కుమార్తె శ్వేతానంద, కుమారుడు అభిషేక్ బ‌చ్చ‌న్.

పెళ్లి త‌రువాత కెరీర్
జ‌యా బ‌చ్చ‌న్ పెళ్లి త‌రువాత కూడా అమితాబ్‌తో సినిమాలు చేశారు. వీరిద్ద‌రి కాంబినేషనులో విడుద‌లైన సినిమాలు ఎన్నో హిట్ సాధించాయి.  అమర్ అక్బర్ ఆంటోని,  సుహాగ్ వంటి సినిమాలు బ్లాక్ బాస్ట‌ర్‌గా నిలిచాయి. ఇక నటి రేఖతో కలిసి నటించిన "మిస్టర్. నట్వర్ లాల్" సినిమాలో బిగ్ బి మొదటిసారి గాయకుని అవతారం ఎత్తారు. ఈ సినిమాకి గానూ ఫిలింఫేర్ ఉత్తమ నటుడు, ఉత్తమ నేపథ్య గాయకుడు కేటగిరిల్లో ఆయనకు నామినేషన్లు లభించాయి. అమితాబ్ బ‌చ్చ‌న్ , రేఖ హీరో హీరోయిన్లుగా ఎక్కువ సినిమాలు చేశారు. వీరిద్దరి కాంబోకు అప్ప‌ట్లో ఓ క్రేజ్ ఉండేది. అమితాబ్ ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా అన్ని  సినిమాలలోనూ న‌టించేవారు. 

అమితాబ్‌ బచ్చ‌న్‌ (Amitabh Bachchan)ను ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ 'బిగ్ బి' అని అభిమానంగా పిలుచుకుంటారు.

'షోలే'తో స్టార్ హీరోగా

1975.. బాలీవుడ్ చరిత్రలోనే కాదు, అమితాబ్ నటనా ప్రస్థానంలోనే  గొప్ప హిట్ సినిమాలను అందించిన సంవత్సరం. ఆ సంవత్సరంలో అమితాబ్ నటించిన 'దీవార్', 'షోలే' సినిమాలు భారతీయ సినిమా చ‌రిత్ర‌ను తిర‌గ‌రాశాయి. 'షోలే' 1975లో భార‌త దేశంలోనే అత్యధిక వ‌సూళ్లను రాబ‌ట్టిన సినిమాగా రికార్డులు సృష్టించింది. ఈ చిత్రం భార‌త దేశ‌మంత‌టా థియేట‌ర్ల‌ను షేక్ చేసింది. విడుదలైన అన్ని రాష్ట్రాల్లోనూ బ్లాక్ బస్టర్ మూవీగా రికార్డులను తిరగరాసింది. భాషలకు అతీతంగా, సినీ అభిమానులందరూ  అమితాబ్ నటనకు బ్రహ్మరథం పట్టారు.  థియేట‌ర్ల‌కు క్యూ క‌ట్టారు.

1982 అమితాబ్‌కు పున‌ర్జ‌న్మ‌
1982లో అమితాబ్ "కూలీ" సినిమా షూటింగ్‌లో గాయ‌ప‌డ్డారు. ఓ సీన్‌లో న‌టిస్తున్న అమితాబ్‌కు దెబ్బ‌లు త‌గిలాయి. జీర్ణాశయానికి గట్టి దెబ్బ త‌గ‌ల‌డంతో చావు అంచుల వ‌ర‌కు అమితాబ్ వెళ్లి వ‌చ్చారు. ఆ రోజుల్లో  అమితాబ్ బ‌చ్చ‌న్‌కు గాయ‌మైంద‌ని తెలిసిన అభిమానులు ఆస్ప‌త్రికి క్యూ క‌ట్టారు. అమితాబ్ ఆస్ప‌త్రిలో ఉన్న నెల రోజులు కూడా అభిమానులు ఆయ‌న్ను చూసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చేవారు. 

అమితాబ్‌ బచ్చ‌న్‌ (Amitabh Bachchan)ను ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ 'బిగ్ బి' అని అభిమానంగా పిలుచుకుంటారు.

రాజకీయాలు
1984లో అమితాబ్ రాజీవ్ గాంధీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా పోటీచేసి గెలిచారు. కానీ మూడేళ్ల‌కే ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు. అమితాబ్ రాజీనామా చేసిన త‌రువాత, పలు కేసుల్లో చిక్కుకొని ఆయన కోర్టు బోను ఎక్కాల్సి వచ్చింది. అయినా ఆయన నిర్దోషిగానే బయటకు వచ్చారు. 

ఆ తర్వాత స‌మాజ్ వాదీ పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చిన అమితాబ్‌.. పలు వివాదాల వల్ల ఆ పార్టీకి కూడా దూరమయ్యారు.   

అమితాబ్‌ బచ్చ‌న్‌ (Amitabh Bachchan)ను ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ 'బిగ్ బి' అని అభిమానంగా పిలుచుకుంటారు.

రిటైర్ మెంట్
1990లో "అగ్నిపథ్" సినిమాలో డాన్ పాత్ర పోషించిన అమితాబ్‌, అదే సినిమాకి గాను జాతీయ ఉత్తమ నటుని అవార్డును అందుకున్నారు.

1992లో "ఖుదా గవా", 1993లో "ఇన్ సానియత్" సినిమాల తరువాత అమితాబ్ 5 ఏళ్ళ పాటు ఏ చిత్రంలోనూ కనిపించలేదు. 

అమితాబ్‌ బచ్చ‌న్‌ (Amitabh Bachchan)ను ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ 'బిగ్ బి' అని అభిమానంగా పిలుచుకుంటారు.

నిర్మాతగా .. ఆ తర్వాత మళ్ళీ నటుడిగా

అమితాబ్ బచ్చన్ నిర్మాతగా ఏబీసీ కార్పొరేషన్ అనే సంస్థను స్థాపించి న‌ష్ట‌పోయారు. 1997లో తానే నిర్మాతగా మళ్ళీ "మృత్యుదూత" సినిమాలో తిరిగి నటించారు. కానీ ఆ సినిమా న‌ష్టాన్ని మిగిల్చింది. అప్పులు తీర్చేందుకు అమితాబ్ త‌న ఆస్తుల‌ను అమ్మేశారు. 

అమితాబ్‌ బచ్చ‌న్‌ (Amitabh Bachchan)ను ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ 'బిగ్ బి' అని అభిమానంగా పిలుచుకుంటారు.

ప‌డి లేచిన కెర‌టంలా
అమితాబ్ తన నిర్మాణ సంస్థ వ‌ల్ల ఎంతో న‌ష్ట‌పోయారు. తీసిన సినిమాలు కూడా న‌ష్టాన్నే తెచ్చిపెట్టాయి. దీంతో బుల్లితెర‌పై వినోదం పంచేందుకు అమితాబ్ కంక‌ణం క‌ట్టుకున్నారు.  "కౌన్ బనేగా కరోడ్ పతి"తో మళ్లీ ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందారు.  బుల్లితెర‌తో పాటు వెండితెర అవకాశాలు కూడా అమితాబ్‌కు వ‌రుస‌గా రావ‌డంతో మ‌రోసారి త‌న న‌ట విశ్వ‌రూపం చూపారు.  మొహబ్బతే, కభీ ఖుషీ కభీ గమ్, బాగ్ బన్, పా, బ్లాక్,  వంటి సినిమాల‌తో అమితాబ్ "బిగ్ బి"గా మారారు. 

అమితాబ్‌ బచ్చ‌న్‌ (Amitabh Bachchan)ను ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ 'బిగ్ బి' అని అభిమానంగా పిలుచుకుంటారు.

అవార్డులు
అమితాబ్ బ‌చ్చ‌న్ (Amitabh Bachchan)  భారతదేశపు మొదటి "యాంగ్రీ యంగ్ మాన్"గా ప్రసిద్ధి చెందారు. హిందీ చిత్ర సీమలో షెహెన్ షా, స్టార్ ఆఫ్ ది మిలీనియం, బిగ్ బి అనే  బిరుదులను కూడా పొందారు. నాలుగు జాతీయ అవార్డులు, 15 ఫిలింఫేర్ అవార్డులు గెలుపొందారు. ఉత్తమ నటుడు కేటగిరీకిగాను 40 సార్లు నామినేట్ అయిన అమితాబ్,  ఫిలింఫేర్  పురస్కారానికి ఎక్కువ సార్లు నామినేట్ అయిన నటుడిగా కూడా వార్తల్లోకెక్కారు.

1984లో భారత ప్రభుత్వం అమితాబ్ ను పద్మశ్రీతోనూ, 2001లో పద్మ భూషణ్ తోనూ, 2015లో పద్మవిభూషణ్ తోనూ గౌరవించింది. 2007లో ఫ్రెంచి ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన "లెగియన్ ఆఫ్ హానర్"తో గౌరవించింది. హాలీవుడ్ పరిశ్రమలో మొదటిసారి అనగా 2013లో "ది గ్రేట్ గాట్స్ బీ" అనే సినిమాతో అడుగుపెట్టారు బచ్చన్. యూదు మతానికి చెందిన మేయర్ వోల్ఫ్ షిం అనే పాత్రలో నటించారాయన. 

అమితాబ్‌ బచ్చ‌న్‌ (Amitabh Bachchan)ను ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ 'బిగ్ బి' అని అభిమానంగా పిలుచుకుంటారు.

ఎంద‌రికో ఆద‌ర్శం అమితాబ్

అమితాబ్ బ‌చ్చ‌న్ జీవితం ఎంద‌రికో ఆద‌ర్శం. ఎన్నో క‌ష్టాల‌కు ఎదురు నిలిచి రిటైర్ అయ్యే వ‌య‌సులో మ‌ళ్లీ సినీ జీవితంలోకి అడుగు పెట్టారు. ప‌ట్టుద‌ల‌తో ముందుకు సాగారు. ప్రేక్ష‌కుల‌కు వినోదం అందించ‌డమే ల‌క్ష్యంగా భార‌తీయ సినిమా ప‌రిశ్ర‌మ‌లో అత్యున్న‌త శిఖ‌రాల‌ను అందుకున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన 'గుడ్ బై' సినిమా అమితాబ్‌కు బ్లాక్ బాస్ట‌ర్ హిట్ ఇచ్చింది. 

అమితాబ్ బ‌చ్చ‌న్ తెలుగు సినిమాల్లోనూ న‌టిస్తున్నారు. చిరంజీవి 'సైరా'లో గురువు పాత్ర‌లో న‌టించారు. ప్ర‌భాస్ సినిమా 'ప్రాజెక్ట్ కె'లో అమితాబ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. 

Read More: Karthikeya 2: 'కార్తికేయ 2' ద‌ర్శ‌కుడిని ప్ర‌శంసించిన‌ అమితాబ్ బ‌చ్చ‌న్

అమితాబ్‌ బచ్చ‌న్‌ (Amitabh Bachchan)ను ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ 'బిగ్ బి' అని అభిమానంగా పిలుచుకుంటారు.

 
 
అమితాబ్ బ‌చ్చ‌న్ ప్రేక్ష‌కుల‌కు మ‌రింత వినోదం అందించాలని పింక్ విల్లా కోరుకుంటుంది. హ్యాపీ బ‌ర్త్ డే అమితాబ్ బ‌చ్చ‌న్ .
పింక్ విల్లా
 
Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!