Good Bye: 'గుడ్ బై' సినిమా ఫ‌స్ట్ లుక్ రిలీజ్..బిగ్ బి కూతురుగా న‌టించిన ర‌ష్మిక‌ (Rashmika Mandanna)

Updated on Sep 03, 2022 03:53 PM IST
Good Bye: 'గుడ్ బై' సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్ కూతురిగా ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) వెండితెర‌పై వినోదం పంచ‌నున్నారు.
Good Bye: 'గుడ్ బై' సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్ కూతురిగా ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) వెండితెర‌పై వినోదం పంచ‌నున్నారు.

Good Bye: సౌత్ స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) న‌టిస్తోన్న 'గుడ్ బై' సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సినిమాతో ర‌ష్మిక బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అంతేకాకుండా బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌తో క‌లిసి ర‌ష్మిక న‌టించారు. వికాస్ బాల్ ద‌ర్శ‌క‌త్వంలో 'గుడ్ బై' సినిమా విడుద‌ల కానుంది. మాన‌వ సంబంధాల గురించి మ‌న‌సుకు హ‌త్తుకునే క‌థ‌గా 'గుడ్ బై' సినిమాను దర్శ‌కుడు తెర‌కెక్కించారు. 

ఫ‌స్ట్ లుక్ రిలీజ్

'సీతారామం' సినిమాలో నెగెటీవ్ షేడ్ పాత్ర‌లో ర‌ష్మిక మంద‌న్న మంచి న‌ట‌న క‌న‌బ‌రిచారు. ర‌ష్మిక న‌టించిన 'గుడ్ బై' సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. బాలీవుడ్ సీనియ‌ర్ న‌టులు అమితాబ్ బ‌చ్చ‌న్‌తో క‌లిసి ర‌ష్మిక 'గుడ్ బై' సినిమాలో న‌టిస్తున్నారు. అమితాబ్, ర‌ష్మిక‌లు ఇద్ద‌రూ క‌లిసి గాలిప‌టం ఎగుర‌వేసే ఫోటోను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. కుటుంబ నేప‌థ్య చిత్రంగా ద‌ర్శ‌కుడు వికాస్ బాల్ ఈ సినిమాను చిత్రీక‌రించారు. అమితాబ్ బ‌చ్చ‌న్ కూతురిగా ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) వెండితెర‌పై వినోదం పంచ‌నున్నారు.

బాలీవుడ్‌లోకి ర‌ష్మిక‌

‘గుడ్ బై’ చిత్రాన్ని నిర్మాత‌ ఏక్తా కపూర్ నిర్మించారు. సాహిల్ మెహతా, శివిన్ నారంగ్, పావైల్ గులాటి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో మొద‌లైంది. ఈ సినిమా అక్టోబర్ 7 తేదీన‌ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 'పుష్ప' సినిమాతో ర‌ష్మిక పాన్ ఇండియా హీరోయిన్‌గా మారారు. నార్త్‌లో ర‌ష్మికకు ఫాలోయింగ్ మ‌రింత పెర‌గింది. ఇక 'గుడ్ బై' చిత్రం రిలీజ్ త‌రువాత ఈ మ‌ల‌యాళ బ్యూటీ బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా మారుతుంద‌ని సినీ కిట్రిక్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Read More: 'గుడ్‌బై'తో ర‌ష్మిక బాలీవుడ్ ఎంట్రీ!.. బిగ్ బి, ర‌ష్మిక (Rashmika Mandanna)ల ఫ‌స్ట్ లుక్ రిలీజ్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!