'గుడ్‌బై'తో ర‌ష్మిక బాలీవుడ్ ఎంట్రీ!.. బిగ్ బి, ర‌ష్మిక (Rashmika Mandanna)ల ఫ‌స్ట్ లుక్ రిలీజ్

Updated on Jul 24, 2022 11:25 AM IST
'గుడ్‌ బై' సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, ర‌ష్మిక మంద‌న్న‌ (Rashmika Mandanna)ల ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
'గుడ్‌ బై' సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, ర‌ష్మిక మంద‌న్న‌ (Rashmika Mandanna)ల ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Good Bye: కూర్గ్ భామ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఫుల్ జోష్‌లో ఉన్నారు. సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ర‌ష్మిక త‌న స‌త్తా చాటేందుకు రెడీ అయ్యారు. అమితాబ్ బ‌చ్చ‌న్‌తో క‌లిసి ర‌ష్మిక మంద‌న్న న‌టించిన 'గుడ్‌బై' సినిమా రిలీజ్ తేదీని మేక‌ర్స్ ఇటీవలే ప్ర‌క‌టించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 7 తేదీన విడుద‌ల కానుంది. బాలీవుడ్‌లో ర‌ష్మిక న‌టించిన మొద‌టి చిత్రం 'గుడ్‌ బై'.

'పుష్ప' సినిమా త‌ర్వాత ర‌ష్మిక మందన్న పాన్ ఇండియా లెవ‌ల్‌లో పేరు తెచ్చుకున్నారు. బాలీవుడ్ సినిమాలకు సంబంధించి వరుస ఆఫ‌ర్ల‌తో ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) దూసుకుపోతున్నారు. ఇదే క్రమంలో, లెజండ‌రీ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న నటించడం విశేషం. 'గుడ్‌బై' సినిమాకు వికాస్ భాల్  ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బాలాజీ మోష‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఏక్తా క‌పూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీగా 'గుడ్‌ బై' తెర‌కెక్కుతుంది. ఈ సినిమాను జీవితం, కుటుంబం, బంధాల‌ను ప్రధాన ఇతివృత్తాలుగా తీసుకొని నిర్మిస్తున్నామంటూ చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. 

'గుడ్‌ బై' సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, ర‌ష్మిక మంద‌న్న‌ (Rashmika Mandanna)ల ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

అమితాబ్ సినిమాలో  ర‌ష్మిక‌

'గుడ్‌ బై' సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, ర‌ష్మిక మంద‌న్న‌ల ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ర‌ష్మిక ఓ పాప్‌కార్న్ బౌల్‌ను అమితాబ్‌కు అందించే ఫోటోను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.  కుటుంబం మొత్తం కలిసి స‌ర‌దాగా టీవీ చూస్తూ ఆనందిస్తున్న పిక్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న ఏ పాత్ర‌లో క‌నిపిస్తారోన‌ని అభిమానులు ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. గుడ్‌బై సినిమాలో నీనా గుప్తా, సునీల్ గ్రోవర్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. 

టాప్ ఆఫ‌ర్ల‌ను అందుకుంటున్న ర‌ష్మిక‌

ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) ప్ర‌స్తుతం ప‌లు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్‌తో మ‌రో పాన్ ఇండియా సినిమా 'పుష్ప 2' లో న‌టిస్తున్నారు. ఇక మ‌ల‌యాళ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించిన‌ 'సీతారామం'లో కూడా ఓ ప్ర‌త్యేక పాత్ర‌లో ర‌ష్మిక క‌నిపించ‌నున్నారు. అలాగే త‌మిళ నటుడు విజ‌య్ తెలుగులో మొద‌టిసారి హీరోగా న‌టిస్తున్న 'వార‌సుడు'లో ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న ఓ సినిమాలో కూడా ర‌ష్మిక స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించ‌నున్నార‌ట‌. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వ‌రుస సినిమాల‌తో ర‌ష్మిక ఫుల్ బిజీగా ఉన్నారు.

Read More: Rashmika Mandanna: ఫిట్ నెస్ పై ప్రత్యేక శ్రద్ద పెట్టిన 'పుష్ప'(Pushpa) బ్యూటీ రష్మిక మందన్నా.. ఫొటోలు వైరల్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!