Karthikeya 2: 'కార్తికేయ 2' ద‌ర్శ‌కుడిని ప్ర‌శంసించిన‌ అమితాబ్ బ‌చ్చ‌న్

Updated on Aug 19, 2022 06:25 PM IST
Karthikeya 2:  బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ (Amitabh Bachchan) ను క‌లిసిన ఫోటోను ద‌ర్శ‌కుడు చందు మొండేటి త‌న ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.
Karthikeya 2: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ (Amitabh Bachchan) ను క‌లిసిన ఫోటోను ద‌ర్శ‌కుడు చందు మొండేటి త‌న ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.

Karthikeya 2: టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) న‌టించిన 'కార్తికేయ 2' చిత్రం సౌత్‌లోనే కాకుండా నార్త్‌లోనూ స‌క్సెస్ సాధించింది. ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చందు మొండేటికి మంచి  గుర్తింపు ద‌క్కింది. తెలుగు ద‌ర్శ‌కుడు చందు మొండేటికి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ ప్ర‌శంస‌లు అందాయి. ప్ర‌స్తుతం అమితాబ్‌ను చందు క‌లిసిన ఫోటోలు వైర‌ల్‌గా మారాయి.

నిఖిల్‌కు బ్లాక్ బాస్ట‌ర్ హిట్

'కార్తికేయ 2' బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. ద‌ర్శ‌కుడు చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ఐదు భాష‌ల్లో ఆగ‌స్టు 13న రిలీజ్ అయింది. విడుద‌ల‌కు ముందే 'కార్తికేయ 2' సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే 'కార్తికేయ 2' బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ద్వార‌కా న‌గ‌ర‌ ర‌హ‌స్యాలను చేధించే క్రమంలో కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకొనే ఓ యువకుడి కథ ఇది. 

Karthikeya 2:  బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ (Amitabh Bachchan) ను క‌లిసిన ఫోటోను ద‌ర్శ‌కుడు చందు మొండేటి త‌న ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.

నార్త్‌లో కార్తికేయ 2 దూకుడు

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ (Amitabh Bachchan) ను క‌లిసిన ఫోటోను ద‌ర్శ‌కుడు చందు మొండేటి త‌న ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ‘జీవితంలో ఆ దీవెన‌లు మ‌ర్చిపోలేని జ్ఞాప‌కాలు.. ధ‌న్య‌వాదాలు అమితాబ్ జీ ..’అంటూ చందు కామెంట్ కూడా పెట్టారు. ప్ర‌స్తుతం హిందీలో ర‌క్షాబంధ‌న్‌, లాల్ సింగ్ చ‌డ్డా సినిమాల‌ను వెన‌క్కి నెట్టేసి 'కార్తికేయ 2' దూసుకుపోతుంది.నార్త్ ఇండియాలో 'కార్తికేయ 2' మంచి క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతుంది. 

'కార్తికేయ' సీక్వెల్‌గా 'కార్తికేయ 2' (Karthikeya 2) ను చిత్రీక‌రించారు. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమా క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. వీరిద్ద‌రి న‌ట‌న‌కు ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుతున్నాయి. మైథ‌లాజిక‌ల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఈ చిత్రంలో కృష్ణ తత్వాన్ని అందరికీ అర్థమయ్యేటట్టు మూడు ముక్కలలో చెప్పే ధన్వంతరి పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్ నటించి మెప్పించారు. 

Read More: మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్న నిఖిల్ (Nikhil) కార్తికేయ 2..హిందీలో థియేటర్లు పెంచారని టాక్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!