‘కోబ్రా’ సినిమాపై తెలుగు ప్రేక్షకుల రియాక్షన్ తెలుసుకోవాలని అనుకుంటున్నా: హీరో విక్రమ్ (Vikram)

Updated on Aug 28, 2022 10:02 PM IST
చియాన్ విక్రమ్ (Vikram) హీరోగా నటించిన కోబ్రా సినిమా ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది
చియాన్ విక్రమ్ (Vikram) హీరోగా నటించిన కోబ్రా సినిమా ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది

టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు చియాన్ విక్రమ్ (Vikram). విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటూ వైవిద్యభరితమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంటారు విక్రమ్. విక్రమ్‌ తాజాగా నటించిన సినిమా కోబ్రా. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌‌గా కోబ్రా సినిమా తెరకెక్కుతోంది. 

ఆగస్టు 31వ తేదీన కోబ్రా సినిమా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ కార్యక్రమాల్లో వేగం పెంచింది చిత్ర యూనిట్. ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో కోబ్రా సినిమా టీమ్ మీడియాతో ముచ్చటించింది.

చియాన్ విక్రమ్ (Vikram) హీరోగా నటించిన కోబ్రా సినిమా ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది

మూడేళ్ల కష్టం..

కోబ్రా సినిమాను పూర్తి చేయడానికి మూడు సంవ‌త్సరాల సమయం ప‌ట్టింది. కోబ్రా కోసం ఎంత క‌ష్టప‌డ్డామో సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులకు తెలుస్తుంది. సైకలాజిక‌ల్ థ్రిల్లర్‌, యాక్షన్ జోన‌ర్‌‌లో సినిమాలు తెర‌కెక్కించిన అజ‌య్ జ్ఞాన‌ముత్తు త‌న‌కు మంచి కథను అందించారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పారు విక్రమ్.

 సినిమాలో  త‌న‌కు స‌పోర్టు చేసిన శ్రీనిధి శెట్టి, మృణాళిని ర‌వి, మీనాక్షికి ధ‌న్యవాదాలు తెలిపారు చియాన్ విక్రమ్.  కోబ్రా సినిమా విడుదల రోజున హైదరాబాద్‌లోనే ఉండి తెలుగు ప్రేక్షకుల స్పందన చూడాలని అనుకుంటున్నానని అన్నారు విక్రమ్ (Vikram). కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టి  హీరోయిన్‌గా న‌టించిన కోబ్రా సినిమా ట్రైలర్‌‌కు మంచి స్పందన లభించింది.  క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ కోబ్రా సినిమాతో మొదటిసారి  సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనున్నారు.

Read More : Vikram: అభిమానులకు మరింత చేరువగా చియాన్ విక్రమ్.. ట్విట్టర్‌‌లో అకౌంట్‌ ఓపెన్ చేస్తున్నట్టు వీడియో

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!