Cobra: 'కోబ్రా' నుంచి మరో ట్రైలర్ రిలీజ్!.. యాక్ష‌న్ సీన్స్‌లో అద‌ర‌గొట్టిన విజ‌య్ (Chiyaan Vikram)

Updated on Aug 25, 2022 07:11 PM IST
 త‌మిళ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) 'కోబ్రా' సినిమాలో సుమారు 20 పాత్రల్లో కనిపించ‌నున్నారు.
త‌మిళ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) 'కోబ్రా' సినిమాలో సుమారు 20 పాత్రల్లో కనిపించ‌నున్నారు.

Cobra: టాలీవుడ్‌లో త‌మిళ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) న‌టించిన 'కోబ్రా' సినిమా నుంచి మేక‌ర్స్ మ‌రో ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. 'కోబ్రా' సినిమా ఆగ‌స్టు 31న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టి విక్ర‌మ్‌కు జోడిగా న‌టించారు. ఆస్కార్ అవార్డు గ్ర‌హీత ఎ.ఆర్‌.రెహ‌మాన్ ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కూర్చారు. 'కోబ్రా' చిత్రం అజ‌య్ జ్ఞానముత్తు ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌ల కానుంది. 

ప‌లు పాత్ర‌ల్లో క‌నువిందు చేయ‌నున్న హీరో

ద‌క్షిణాదిన విక్ర‌మ్ సినిమాల‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. 'శివపుత్రుడు','అపరిచితుడు', 'ఐ' లాంటి సినిమాలను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రించారు. విక్ర‌మ్ న‌టించిన 'కోబ్రా' (Cobra) కూడా తెలుగులో విడుద‌ల కానుంది.  'కోబ్రా'లో విక్రమ్ సుమారు 20 పాత్రల్లో కనిపించ‌నున్నారు. క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ కోబ్రాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. రోష‌న్ మాథ్యూ, డైరెక్ట‌ర్ కేఎస్ ర‌వికుమార్, మృణాళినీ ర‌వి, మియా జార్జ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

'కోబ్రా' సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నిర్మాత ఎస్‌.ఎస్‌ లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. హరీష్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ఈ సినిమా త‌మిళ్‌తో పాటు తెలుగు, క‌న్న‌డ భాషల్లో ఆగ‌స్టు 31 తేదీన‌ విడుద‌ల కానుంది. 'కోబ్రా' సినిమా ముందుగా ఆగ‌స్టు 11న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆల‌స్యం కావ‌డంతో ఈ సినిమా రిలీజ్ తేదీని మేక‌ర్స్ మార్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల 'కోబ్రా' చిత్రం హక్కులను ఎన్వీ ప్రసాద్  సొంతం చేసుకున్నారు.  

Read More: విక్ర‌మ్ (Chiyaan Vikram) న‌టించిన కోబ్రా రిలీజ్ తేదీ ఖ‌రారు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!