Cobra Movie: 'కోబ్రా' సినిమాకు 3 సంఖ్య క‌లిసి వ‌స్తుందా! 'ఆర్ఆర్ఆర్' కంటే ఎక్కువ ర‌న్ టైం సినిమా ఇది ?

Updated on Aug 28, 2022 07:06 PM IST
Cobra Movie: 'కోబ్రా'  సినిమా 3 గంట‌ల 3 నిమిషాల 3 సెకన్ల ర‌న్‌టైమ్‌తో థియేట‌ర్‌లో విడుద‌ల కానుంది.
Cobra Movie: 'కోబ్రా' సినిమా 3 గంట‌ల 3 నిమిషాల 3 సెకన్ల ర‌న్‌టైమ్‌తో థియేట‌ర్‌లో విడుద‌ల కానుంది.

Cobra Movie: సౌత్ స్టార్ హీరో  చియాన్ విక్రమ్ (Chiyaan Vikram)  విభిన్నమైన కథాంశాలతో ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచుతూ ఉంటారు. సామాజిక ఇతివృత్తాలను ప్రధానాంశాలుగా తీసుకొని, విక్ర‌మ్ ఎక్కువ‌గా సినిమాలు చేస్తుంటారు. ఇటీవలి కాలంలో విక్ర‌మ్ న‌టించిన 'కోబ్రా' సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఆగ‌స్టు 31న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. 'కోబ్రా' సినిమా ర‌న్ టైం అంద‌రినీ ఆశ్చ‌ర్యప‌రుస్తోంది. 'ఆర్ఆర్ఆర్' సినిమా కంటే ఎక్కువ ర‌న్ టైమ్‌ ఉండ‌టంతో, ఈ సినిమాపై ఆస‌క్తి మ‌రింత పెరిగింది. 

అన్ని పాత్ర‌ల్లో విక్ర‌మ్ క‌నిపిస్తారా!

ద‌క్షిణాదిన విక్ర‌మ్ సినిమాల‌కు ఒక ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. 'శివపుత్రుడు','అపరిచితుడు', 'ఐ' లాంటి సినిమాలను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రించారు. విక్ర‌మ్ న‌టించిన 'కోబ్రా' (Cobra) కూడా తెలుగులో విడుద‌ల కానుంది.  'కోబ్రా'లో విక్రమ్ సుమారు 20 నుంచి 25 పాత్రల్లో కనిపించ‌నున్నారు. క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ 'కోబ్రా'తో సినీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. రోష‌న్ మాథ్యూ, డైరెక్ట‌ర్ కేఎస్ ర‌వికుమార్, మృణాళినీ ర‌వి, మియా జార్జ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

 

 

మూడు గంటల సినిమా కోబ్రా

'కోబ్రా' చిత్రానికి సెన్సార్ యూఏ స‌ర్టిఫికేట్‌ను జారీ చేసింది. ఈ సినిమా 3 గంట‌ల 3 నిమిషాల 3 సెకన్ల ర‌న్‌టైమ్‌తో థియేట‌ర్‌లో విడుద‌ల కానుంది. ఇటీవ‌లే విడుద‌లైన 'ఆర్ఆర్ఆర్' సినిమా ర‌న్ టైమ్‌ 3 గంట‌ల రెండు నిమిషాలు. 'ఆర్ఆర్ఆర్' సినిమా కంటే ఎక్కువ ర‌న్ టైమ్‌తో 'కోబ్రా' రిలీజ్ కానుంది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి విక్ర‌మ్‌కు జోడిగా న‌టించడం విశేషం. ఆస్కార్ అవార్డు గ్ర‌హీత ఎ.ఆర్‌.రెహ‌మాన్ ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కూర్చారు. 'కోబ్రా' చిత్రం అజ‌య్ జ్ఞానముత్తు ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌ల కానుంది. 

Read More: Cobra: 'కోబ్రా' నుంచి మరో ట్రైలర్ రిలీజ్!.. యాక్ష‌న్ సీన్స్‌లో అద‌ర‌గొట్టిన విజ‌య్ (Chiyaan Vikram)

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!