చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) ప్రధాన పాత్రలో యాక్షన్ థ్రిల్లర్ 'కోబ్రా' (Cobra Teaser).. ఆసక్తికరంగా టీజర్!

Updated on Aug 24, 2022 08:37 PM IST
‘కోబ్రా’ చిత్రం ఆగస్ట్‌ 31న థియేటర్లోకి రాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్‌ను (Cobra Teaser) రిలీజ్‌ చేసింది.
‘కోబ్రా’ చిత్రం ఆగస్ట్‌ 31న థియేటర్లోకి రాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్‌ను (Cobra Teaser) రిలీజ్‌ చేసింది.

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) కథానాయకుడిగా నటించిన సినిమా 'కోబ్రా' (Cobra). సెవెన్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించాడు. ఈ నెల 31వ తేదీన ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేస్తున్నారు. ఎస్‌ఎస్‌ లలిత్‌ కుమార్‌ నిర్మించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో కథానాయికగా ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ శ్రీనిధి శెట్టి కనిపించనుంది. 

చియాన్ విక్రమ్ (Chiyaan Vikram)  స్క్రీన్‌పై కనిపించి చాలాకాలమే అయ్యింది. అయితే కొన్నాళ్లుగా విక్రమ్.. అన్నీ క్రైమ్, థ్రిల్లర్ జోనర్లలోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కమర్షియాలిటీని పూర్తిగా పక్కన పెట్టేశాడు. తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ అంశంతో విక్రమ్ అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యాడు. విక్రమ్ ప్రస్తుతం 'పొన్నియిన్ సెల్వన్'(Ponniyin Selvan), 'కోబ్రా' (Cobra) చిత్రాల్లో నటిస్తున్నాడు. 

‘కోబ్రా’ చిత్రం ఆగస్ట్‌ 31న థియేటర్లోకి రాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ జోరు పెంచింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్‌ను (Cobra Teaser) రిలీజ్‌ చేసింది. ఇందులో ‘కోబ్రా.. లెక్కలతో నేరాలను చాలా తేలికగా చేస్తున్నాడు’ అనే డైలాగ్‌ ఆసక్తిగా ఉంది. ఇందులో చియాన్‌ విభిన్న పాత్రల్లో కనిపించి మరోసారి ఫ్యాన్స్‌ ను ఫిదా చేయబోతున్నాడు. 

అయితే, ఇది కేవలం యాక్షన్ సినిమానే కాదని.. ఇందులో విక్రమ్ చాలా తెలివైన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడని టీజర్ (Cobra Teaser) చూస్తుంటే అర్థమవుతోంది. సింపుల్‌గా చెప్పాలంటే విక్రమ్ ఇతర చిత్రాలలాగానే ఇది ఒక ఇంట్రెస్టింగ్ పజిల్ అని అనిపిస్తోంది. విక్రమ్ ఎప్పటిలాగానే విలక్షణమైన నటనను కనబరిచాడు.  ఈ సినిమా కోసం భారీ స్థాయిలో ఖర్చు చేసినట్టుగా టీజర్ ను చూస్తేనే తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. చాలా కాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న విక్రమ్ కు, ఈ సినిమాతో ఆ నిరీక్షణ ఫలిస్తుందని భావిస్తున్నాడు. మరోవైపు.. 'కోబ్రా'లో విక్రమ్ సుమారు 20 పాత్రల్లో కనిపిస్తారని టాక్. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan), కేఎస్ రవికుమార్, సత్యదేవ్, మృణాళిని రవి, మియా జార్జ్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

Read More: విక్ర‌మ్ (Chiyaan Vikram) న‌టించిన కోబ్రా రిలీజ్ తేదీ ఖ‌రారు!

Advertisement
Credits: pinkvilla

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!