విక్ర‌మ్ (Chiyaan Vikram) న‌టించిన కోబ్రా రిలీజ్ తేదీ ఖ‌రారు!

Updated on Aug 10, 2022 05:46 PM IST
విక్ర‌మ్ (Chiyaan Vikram) న‌టించిన కోబ్రా సినిమా త‌మిళ్‌తో పాటు తెలుగు, క‌న్న‌డ భాషల్లో ఆగ‌స్టు 31 తేదీన‌ విడుద‌ల కానుంది. '
విక్ర‌మ్ (Chiyaan Vikram) న‌టించిన కోబ్రా సినిమా త‌మిళ్‌తో పాటు తెలుగు, క‌న్న‌డ భాషల్లో ఆగ‌స్టు 31 తేదీన‌ విడుద‌ల కానుంది. '

త‌మిళ స్టార్ హీరో విక్ర‌మ్ (Vikram) న‌టించిన‌ 'కోబ్రా' సినిమా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అజ‌య్ జ్ఞాన‌ముత్తు ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమా ఆగ‌స్టు 31 న విడుద‌ల కానుంది. ఈ సినిమాలో కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టి విక్ర‌మ్‌కు జోడిగా న‌టించారు. ఆస్కార్ అవార్డు గ్ర‌హీత ఎ.ఆర్‌.రెహ‌మాన్ ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కూర్చారు. 

'కోబ్రా'లో న‌టించిన క్రికెట‌ర్ 

'కోబ్రా' (Cobra) చిత్రం నుంచి మేక‌ర్స్ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఆ పోస్ట‌ర్‌లో విక్ర‌మ్ ఫైట్ స‌న్నివేశం 'కోబ్రా' పై అంచ‌నాల‌ను మ‌రింత పెంచింది. శ్రీనిధి శెట్టి 'కోబ్రా' సినిమాతో త‌మిళ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ కోబ్రాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. రోష‌న్ మాథ్యూ, డైరెక్ట‌ర్ కేఎస్ ర‌వికుమార్, మృణాళినీ ర‌వి, మియా జార్జ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

'కోబ్రా' సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నిర్మాత ఎస్‌.ఎస్‌ లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. హరీష్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ఈ సినిమా త‌మిళ్‌తో పాటు తెలుగు, క‌న్న‌డ భాషల్లో ఆగ‌స్టు 31 తేదీన‌ విడుద‌ల కానుంది. 'కోబ్రా' సినిమా ముందుగా ఆగ‌స్టు 11న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆల‌స్యం కావ‌డంతో ఈ సినిమా రిలీజ్ తేదీని మేక‌ర్స్ మార్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల 'కోబ్రా' చిత్రం హక్కులను ఎన్వీ ప్రసాద్  సొంతం చేసుకున్నారు.  

Read More: Cobra: కోబ్రాగా వ‌స్తున్న విక్ర‌మ్ (Vikram) .. ప్ర‌తీ స‌మ‌స్య‌ ప‌రిష్కారానికి ఓ లెక్క ఉంది !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!