చియాన్ విక్రమ్‌ (Chiyaan Vikram) ‘కోబ్రా’ రన్‌టైమ్ 20 నిమిషాలు తగ్గించాం..ఇన్‌స్టాగ్రామ్‌లో అజయ్‌ జ్ఞానముత్తు

Updated on Sep 05, 2022 08:12 PM IST
చియాన్‌ విక్రమ్‌ (Chiyaan Vikram) హీరోగా నటించిన కోబ్రా సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ క్రమంలో డైరెక్టర్‌‌ ప్రేక్షకులతో చిట్‌చాట్ చేశారు
చియాన్‌ విక్రమ్‌ (Chiyaan Vikram) హీరోగా నటించిన కోబ్రా సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ క్రమంలో డైరెక్టర్‌‌ ప్రేక్షకులతో చిట్‌చాట్ చేశారు

చియాన్‌ విక్రమ్‌ (Chiyaan Vikram) నటించిన లేటెస్ట్‌ సినిమా కోబ్రా. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 31వ తేదీన ప్రేక్షకులు ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని కేంద్రాలలోనూ కోబ్రా సినిమా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. హిట్‌టాక్‌ వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. సినిమా రన్‌టైమ్‌ ఎక్కువగా ఉందని, స్క్రీన్‌ ప్లే గందరగోళంగా ఉందంటూ సోషల్‌ మీడియా వేదికగా నెగెటివ్‌ కామెంట్స్‌ వస్తున్నాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా లైవ్‌చాట్‌లో నెటిజన్లతో ముచ్చటించారు డైరెక్టర్‌ అజయ్ జ్ఞానముత్తు.

కథ, కథనం బాగున్నప్పటికీ క్లైమాక్స్‌ నిరాశ పరిచిందన్నారు ఒక నెటిజన్. దీనిపై స్పందించిన అజయ్‌ జ్ఞానముత్తు.. ‘పోలీసుల నుంచి హీరో తప్పించుకుని  విదేశాల్లో బతుకుతున్నట్లు క్లైమాక్స్‌ రాయవచ్చు. కానీ, అటువంటి నేరస్థుడికి ఎలాంటి శిక్ష పడకపోవడం న్యాయం కాదు కదా!’ అని వివరించారు. కోబ్రా సినిమా రన్‌టైమ్‌ ఎక్కువగా ఉందని మరో నెటిజన్‌ వేసిన ప్రశ్నకు కూడా ఆయన సమాధానమిచ్చారు.

చియాన్‌ విక్రమ్‌ (Chiyaan Vikram) హీరోగా నటించిన కోబ్రా సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ క్రమంలో డైరెక్టర్‌‌ ప్రేక్షకులతో చిట్‌చాట్ చేశారు

అప్పుడు ఆలోచించలేదు..

ఈ సినిమాలోని ప్రతీ కీలక విషయాన్ని ప్రేక్షకుడికి చూపించాలనుకున్నామని చెప్పారు. అందుకే రన్‌టైమ్‌ గురించి ఆలోచించలేదని అన్నారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన మేరకు సినిమా రన్‌టైమ్‌ను 20 నిమిషాలు తగ్గించామని చెప్పారు జ్ఞానముత్తు.

ఇక, స్క్రీన్‌ప్లే గందరగోళంగా ఉందని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ‘మిమ్మల్ని గందరగోళానికి గురి చేసినందుకు సారీ. ప్రతిక్షణం ఉత్కంఠకు గురి చేసే సినిమా చూడడానికి ఒక ప్రేక్షకుడిగా నేను ఇష్టపడతాను. అందుకే కోబ్రా సినిమాను తెరకెక్కించాను.

సాధ్యమైతే మరోసారి కోబ్రా సినిమాను చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది’ అని చెప్పుకొచ్చారు డైరెక్టర్. 7 స్క్రీన్స్‌ పతాకంపై ఎస్‌ఎస్‌ లలిత్‌ కుమార్‌ నిర్మించిన కోబ్రా చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందించారు. కోబ్రా సినిమాలో చియాన్ విక్రమ్‌ (Chiyaan Vikram) సరసన ‘కేజీయఫ్‌’ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించారు.

Read More : Cobra Movie Review: చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) వన్‌ మ్యాన్ షో.. రన్‌ టైమ్‌ ఎక్కువైంది

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!