Vikram: అభిమానులకు మరింత చేరువగా చియాన్ విక్రమ్.. ట్విట్టర్‌‌లో అకౌంట్‌ ఓపెన్ చేస్తున్నట్టు వీడియో

Updated on Aug 13, 2022 06:19 PM IST
చియాన్‌ విక్రమ్‌ (Vikram) ట్విట్టర్‌‌లో అకౌంట్‌ ఓపెన్ చేస్తున్నట్టు ఒక వీడియోను షేర్ చేశారు
చియాన్‌ విక్రమ్‌ (Vikram) ట్విట్టర్‌‌లో అకౌంట్‌ ఓపెన్ చేస్తున్నట్టు ఒక వీడియోను షేర్ చేశారు

చియాన్‌ విక్రమ్‌ (Vikram) ఇకపై అభిమానులకు మరింత చేరువగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తన సినిమా అప్‌డేట్లు, ముఖ్యమైన విషయాలను వీలైనంత ఎక్కువమంది అభిమానులకు చేరువ చేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం విక్రమ్ తీసుకున్న నిర్ణయం గురించి తెలిస్తే ఆయన అభిమానులు నిజంగానే పండుగ చేసుకుంటారు. ఈ మేరకు విక్రమ్ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ ఆసక్తికరమైన వీడియో నెట్టింట్ వైరల్ అవుతోంది.

వరుసగా సినిమాలు చేస్తూ ఎప్పుడూ ఫుల్‌ బిజీగా ఉంటారు చియాన్ విక్రమ్. విభిన్నమైన కథలను ఎంచుకోవడమే కాకుండా అందులో తన గెటప్‌ కోసం ఎంత కష్టపడడానికైనా వెనుకాడరు విక్రమ్. అందుకే ఆయనంటే అభిమానులకు విపరీతమైన క్రేజ్. ఇక, సినిమాల్లో అంత యాక్టివ్‌గా ఉండే విక్రమ్‌ సోషల్‌ మీడియాలో మాత్రం అంత యాక్టివ్‌గా ఉండరు. చాలా కాలం నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నా స్టార్ హీరో అయినా కూడా ఆయనకు ఇప్పటివరకు ఫేస్‌బుక్‌లో అకౌంట్‌ లేదు. అంటే ఆయన సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటారో అర్ధమవుతుంది.

స్పెషల్ వీడియోలో..

అభిమానులందరి కోరికతో 2016 నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంటర్ అయ్యారు విక్రమ్. ‘therealchiyaan’ అనే పేరుతో ఉన్న అకౌంట్ ద్వారా తన ఇష్టాయిష్టాలు, కొత్త సినిమా విశేషాలు, షూటింగ్ లొకేషన్స్‌ సహా పలు అంశాలను షేర్ చేసుకుంటారు విక్రమ్. తాజాగా విక్రమ్ మరో సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టారు. ట్విట్టర్‌‌లో అకౌంట్ ఓపెన్ చేసినట్టు స్పెషల్ వీడియో ద్వారా తెలియజేశారు. శుక్రవారం రాత్రి షేర్‌‌ చేసిన ఆ వీడియోలో డిఫరెంట్‌ లుక్‌లో కనిపించారు విక్రమ్.

‘నేను మీ చియాన్‌ విక్రమ్‌. నిజంగా నేనే. డూప్‌ కాదు. నా తర్వాత సినిమా కోసం ఇలా రెడీ అవుతున్నాను. చాలా లేట్‌గా వచ్చాను.. ఏం అనుకోకండి. కానీ ఇది సరైన సమయం అనే అనుకుంటున్నా. మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ఇకపై మీకు ట్విట్టర్‌లో కూడా అందుబాటులో ఉంటాను’ అని చియాన్ విక్రమ్‌ (Vikram) పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

Read More : 'చియాన్' విక్రమ్ (Vikram) నటించిన ఈ టాప్ 5 చిత్రాలు చాలా స్పెషల్ .. తెలుగు ప్రేక్షకులు తప్పక చూడాలి

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!