‘సలార్’ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది.. క్యారెక్టర్ గురించి ఇప్పుడే చెప్పలేను: శృతిహాసన్ (Shruti Haasan)

Updated on Jul 07, 2022 07:22 PM IST
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్’ సినిమాలో నటిస్తున్నారు శృతి. ఇటీవల మీడియాతో శృతి హాసన్ (Shruti Hassan) మాట్లాడారు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్’ సినిమాలో నటిస్తున్నారు శృతి. ఇటీవల మీడియాతో శృతి హాసన్ (Shruti Hassan) మాట్లాడారు

లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు శ్రుతి హాసన్(Shruti Haasan). తండ్రికి తగిన కూతురిగా రాణిస్తూ స్టార్‌‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన శృతి.. ఓ మై ఫ్రెండ్, గబ్బర్ సింగ్, ఎవడు, బలుపు, రేసుగుర్రం, శ్రీమంతుడు సినిమాలో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు.

ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్’ సినిమాలో నటిస్తున్నారు శృతి. ఇటీవల మీడియాతో శృతి హాసన్ (Shruti Hassan) మాట్లాడారు. ఆ ముచ్చట్లు ఆమె మాటల్లోనే.. 

ఇప్పుడే చెప్పలేను..

సలార్ సినిమాలో నా క్యారెక్టర్ గురించి ఇప్పుడు ఎక్కువగా చెప్పలేను. ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. డిఫరెంట్‌ క్యారెక్టర్‌‌ కోసం వెయిట్‌ చేస్తున్న సమయంలో 'సలార్' సినిమాలో నటించే చాన్స్ వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సలార్ షూటింగ్‌లో పాల్గొంటున్నాను.

మరో రెండు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తున్నాను. అయితే వాటి వివరాలను ఇప్పుడే చెప్పలేను. హిందీ సినిమా కథలు కూడా వింటున్నాను. కానీ ఇప్పటి వరకు ఏ సినిమా ఓకే చేయలేదు.

సలార్ సినిమా పోస్టర్

నాన్న నుంచి చాలా నేర్చుకున్నా..

ఇళయరాజా, ఏఆర్‌ రెహ్మన్‌ సంగీతం నాకు చాలా ఇష్టం. నాకు ఐదున్నర సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, సినిమాలో పాట పాడడానికి నాన్న పిలిచారు. తర్వాత కూడా చాలాసార్లు పాటలు పాడడానికి పిలిచారు. అప్పటి నుంచే నాన్నతో కలిసి పనిచేస్తున్నా. ఆయన  నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.

వ్యక్తిగతంగా, సంగీత పరంగా కూడా రెహ్మాన్ చాలా గొప్పవారు. ఆయనతో మాట్లాడితే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఆయన సంగీతం అందించిన దిల్‌ సే, రంగీలా సినిమాల్లోని పాటలు ఎప్పటికీ నా ఫేవరెట్.

త్వరలో మరో ఆల్బమ్..

ఇప్పటికే చాలా పాటలు పాడాను. అన్ని ఆల్బమ్స్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. చిన్నప్పటి నుంచీ పాటలు పాడుతూనే ఉన్నా. త్వరలోనే మరో ఆల్బమ్‌ రిలీజ్‌ చేస్తా. ఇంటికెళ్లగానే పియానో పట్టుకుని ప్రాక్టీస్ చేయడం అలవాటు.

సినిమాల్లోకి వచ్చినప్పుడు పాటలు కూడా పాడతాను ఎవరితోనైనా ఇదే విషయం చెబితే.. నన్ను వింతగా చూసేవారు. మల్టీటాస్క్ చేసే వాళ్లకు అప్పట్లో అంత ప్రయారిటీ లేదు. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రోత్సహించే వాళ్లు ఎక్కువయ్యారని శృతిహాసన్ (Shruti Haasan) చెప్పుకొచ్చారు.

Read More : ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్‌ కానున్న కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘సమ్మతమే’.. ఎప్పటి నుంచి అంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!