‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్‌ కానున్న కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘సమ్మతమే’.. ఎప్పటి నుంచి అంటే?

Updated on Jul 07, 2022 07:30 PM IST
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘సమ్మతమే’ సినిమా పోస్టర్
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘సమ్మతమే’ సినిమా పోస్టర్

వారం వారం సరికొత్త వెబ్ సిరీస్‌లు, షోలు, సినిమాలలో ప్రేక్షకులను అలరిస్తోంది ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’ (Aha). ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించడానికి ఈ వేదిక రెడీ అవుతోంది. థియేటర్లలో రిలీజై మంచి టాక్‌ను సొంతం చేసుకున్న సినిమాలను ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తూ సినీ ప్రేమికులకు వినోదాన్ని అందిస్తోంది 'ఆహా' .

ఈ క్రమంలోనే కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటించిన లవ్‌ ఎంటర్‌‌టైనర్‌‌ ‘సమ్మతమే’ సినిమాను, ఆహా సబ్‌స్క్రైబర్స్‌ కోసం  ఓటీటీలో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ఇటీవలే థియేటర్లలో రిలీజైన 'సమ్మతమే' సినిమా ఈ నెల 15వ తేదీ నుంచి 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ప్రత్యేక గుర్తింపు..

వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ వినూత్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తున్నారు హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). తనదైన శైలి నటనతో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కిర‌ణ్. నాలుగు సినిమాల్లో మాత్రమే నటించినా, ప్రేక్షకుల హృదయాల్లో చోటు దక్కించుకున్నారు.

2022 మొదట్లోనే ‘సెబాస్టియన్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించినా.. ఆ సినిమాకు అనుకున్నంత రెస్పాన్స్ అభిమానుల నుంచి రాలేదు. ఆ తర్వాత విడుదలైన "ఎస్సార్ కళ్యాణమండపం"  సినిమాతో అభిమానులను కొంత నిరాశపరచిన కిరణ్.. ‘స‌మ్మత‌మే’ సినిమాతో అలరించారు.

జూన్ 24వ తేదీన విడుద‌లైన ‘సమ్మతమే’ సినిమా మంచి టాక్‌ తెచ్చుకుంది. ఇక, తాజాగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది.  ప్రముఖ ఓటీటీ సంస్థ "ఆహా"లో జూలై 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానున్న ‘సమ్మతమే’ సినిమాకు గోపినాథ్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. కిరణ్‌ సరసన చాందిని చౌదరి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు.

‘సమ్మతమే’ సినిమా పోస్టర్

కథేంటంటే..

కృష్ణ (కిరణ్ అబ్బవరం) చిన్నతనంలోనే అమ్మను కోల్పోతాడు. అప్పటి నుంచి, సంప్రదాయాలను ప్రేమించే అమ్మాయినే  పెళ్లి చేసుకోవాలన్నది కృష్ణ లక్ష్యంగా మారుతుంది. అందుకే ప్రేమకు దూరంగా ఉంటూ.. పెళ్లి తరువాతే ప్రేమ అనేలా పెరిగి పెద్దవుతాడు. అలాంటి కృష్ణకు శాన్వి (చాందినీ చౌదరి) పరిచయం అవుతుంది.

తాను కోరుకున్న లక్షణాలు ఒక్కటి కూడా లేని శాన్వితో కృష్ణ ప్రయాణం ఎలా సాగుతుంది? పెళ్లికి ముందు ప్రేమించబోను అని చెప్పే కృష్ణ చివరకు ప్రేమలో పడడం ఎలా సాధ్యమైంది? ఈ కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది? శాన్వి, కృష్ణల ప్రయాణం ఎలా ముగుస్తుంది? అనేదే కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన ‘సమ్మతమే’ సినిమా కథ.

Read More : కెరీర్‌‌ పరంగా ఆనందంగానే ఉన్నా.. యాక్షన్ సినిమాలు చేయడం ఇష్టం: లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!