బాలీవుడ్ స్టార్ గోవిందాతో ‘సామి సామి’ పాటకు డాన్స్ చేసిన రష్మికా మందాన (Rashmika Mandanna).. వీడియో వైరల్

Updated on Sep 25, 2022 08:59 PM IST
పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న రష్మికా మందాన (Rashmika Mandanna) అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటించిన సినిమా గుడ్‌బై
పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న రష్మికా మందాన (Rashmika Mandanna) అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటించిన సినిమా గుడ్‌బై

పుష్ప సినిమాతో స్టార్ హీరోయిన్‌ స్టేటస్‌ను సంపాదించుకున్నారు రష్మికా మందాన (Rashmika Mandanna). ఆ సినిమాలో ఆమె డాన్స్, నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. సినిమాలో అల్లు అర్జున్ మేనరిజంతోపాటు పాటల్లో వేసిన స్టెప్స్‌కు కూడా మంచి హైప్ వచ్చింది.

పుష్ప సినిమాలో పాటలకు రష్మికా మందాన వేసిన స్టెప్స్‌ జనాలకు బాగా చేరువయ్యాయి. శ్రీవల్లిగా నటించిన రష్మిక.. పుష్ప సినిమాతో వచ్చిన క్రేజ్‌తో బాలీవుడ్‌లో కూడా ఆఫర్లు కొట్టేశారు. సినిమా రిలీజై సంవత్సరం గడుస్తున్నా అందులోని పాటలు వినిపిస్తే ప్రేక్షకులు ఇప్పటికీ కాలు కదుపుతారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.

పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న రష్మికా మందాన (Rashmika Mandanna) అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటించిన సినిమా గుడ్‌బై

ప్రోమో రిలీజ్ చేసిన జీ టీవీ..

ప్రజల్లో అంత క్రేజ్‌ తెచ్చుకున్న సామి సామి పాటకు మరోసారి డాన్స్ చేశారు రష్మిక. అయితే ఈసారి ఆ స్టెప్పులు వేసింది మాత్రం సినిమా కోసం కాదు. బాలీవుడ్‌లో తాను నటించిన సినిమా ‘గుడ్‌బై’ ప్రమోషన్స్‌లో. గుడ్‌బై సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జీ టీవీలో ప్రసారమయ్యే DID SuperMoms అనే షో కు హాజరయ్యారు రష్మిక. ఈ షోకు భాగ్యశ్రీ, రెమో డిసౌజా జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్ యాక్టర్‌‌ గోవిందా, రష్మికా మందాన ఈ షోకు గెస్ట్‌లుగా వెళ్లారు.

త్వరలో ప్రసారం కాబోయే ఆ షోకు సంబంధించిన ప్రోమోను షేర్‌‌ చేసింది జీ టీవీ. ఆ ప్రోమోలో గోవిందాతో కలిసి సామి సామి పాటకు స్టెప్పులు వేశారు రష్మికా మందాన (Rashmika Mandanna). ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. వికాస్‌ బాల్ దర్శకత్వంలో తెరకెక్కిన గుడ్‌బై సినిమాలో బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్ కీలకపాత్ర పోషించారు. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన గుడ్‌బై సినిమా అక్టోబర్‌‌ 7వ తేదీన విడుదల కానుంది.

Read More : పుష్ప (Pushpa) సినిమాతో వచ్చిన క్రేజ్‌ను బాగానే క్యాష్‌ చేసుకుంటున్న రష్మికా మందాన (Rashmika Mandanna)..

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!