పుష్ప (Pushpa) సినిమాతో వచ్చిన క్రేజ్‌ను బాగానే క్యాష్‌ చేసుకుంటున్న రష్మికా మందాన (Rashmika Mandanna)..

Updated on Sep 15, 2022 09:42 PM IST
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప సినిమా హిట్‌ కావడంతో రష్మికా మందాన (Rashmika Mandanna) నేషనల్ క్రష్‌ అయ్యారు
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప సినిమా హిట్‌ కావడంతో రష్మికా మందాన (Rashmika Mandanna) నేషనల్ క్రష్‌ అయ్యారు

పుష్ప (Pushpa) సినిమాతో స్టార్ హీరోయిన్‌ స్టేటస్‌ను సంపాదించుకున్నారు హీరోయిన్‌ రష్మికా మందాన (Rashmika Mandanna). ఈ సినిమాతో వచ్చిన క్రేజ్‌తో నేషనల్ క్రష్‌ అనే పేరు వచ్చింది ఈ భామకు. కిర్రిక్ పార్టీ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన రష్మిక.. తన అందం అభినయంతో తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. తన క్యూట్‌ లుక్స్, డైలాగ్స్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇక అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప సినిమాలో హీరోయిన్‌గా నటించి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు రష్మిక.

పుష్ప సినిమాతో వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడంలో రష్మిక సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఈ సినిమా హిట్ తర్వాత చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నారు రష్మికా మందాన. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌తో ‘గుడ్‌బై’ సినిమాలో, సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి ‘మిషన్‌ మజ్ను’లోనూ నటిస్తున్నారు. రణ్‌వీర్‌ కపూర్‌ సినిమాలోనూ ఒక క్యారెక్టర్‌‌ చేయనున్నారు.

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప సినిమా హిట్‌ కావడంతో రష్మికా మందాన (Rashmika Mandanna) నేషనల్ క్రష్‌ అయ్యారు

సినిమా రిలీజ్ కాకముందే..

 అల్లు అర్జున్‌ పుష్ప సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘పుష్ప2’ సినిమా కోసం రష్మిక రూ. 4 కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకోనున్నారని టాక్. అయితే ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్‌లోనే విడుదల కానుంది. పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్‌తో పుష్ప2 సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. దాంతో పుష్ప2 సినిమా షూటింగ్ పూర్తికాక ముందే రెమ్యునరేషన్‌ను రష్మిక మరోసారి పెంచేశారని తెలుస్తోంది.

ఇక నుంచి ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకోనున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో తనకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని రష్మిక (Rashmika Mandanna) ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప: ది రైజ్‌’ సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల భారీ వసూళ్లను సాధించింది. సుకుమార్‌ దర్శకత్వం వహించిన పుష్ప (Pushpa) సినిమా ఇటీవల నిర్వహించిన సైమా (సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌) వేడుకల్లో  ఆరు అవార్డులను దక్కించుకుంది.  

Read More : Pushpa 2: 'పుష్ప 2 ' షూటింగ్ గురించి తీపి క‌బురు చెప్పిన రష్మిక (Rashmika Mandanna)!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!