Good Bye Trailer: ర‌ష్మిక మంద‌న్నా(Rashmika Mandanna) బాలీవుడ్ సినిమా ‘గుడ్ బై’ ట్రైల‌ర్ రిలీజ్ 

Updated on Sep 06, 2022 08:13 PM IST
'గుడ్ బై' సినిమాలో ఎవ‌రిపై ఆధార‌ప‌డ‌కుండా త‌న కాళ్ల‌పై తాను నిలిబ‌డాల‌నుకునే అమ్మాయిగా ర‌ష్మిక (Rashmika Mandanna)  న‌టించారు.
'గుడ్ బై' సినిమాలో ఎవ‌రిపై ఆధార‌ప‌డ‌కుండా త‌న కాళ్ల‌పై తాను నిలిబ‌డాల‌నుకునే అమ్మాయిగా ర‌ష్మిక (Rashmika Mandanna)  న‌టించారు.

Good Bye Trailer: 'పుష్ప‌' సినిమా త‌రువాత సౌత్ స్టార్ హీరోయిన్‌గా మారిన‌ ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) బాలీవుడ్‌లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనుంది. 'గుడ్ బై' సినిమాతో నార్త్ ప్రేక్ష‌కుల‌కు చేరువ కానుంది.ఇటీవ‌లే ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్ తాజాగా ట్రైల‌ర్‌ను లాంచ్ చేశారు. బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌తో క‌లిసి ర‌ష్మిక న‌టించారు. వికాస్ బాల్ ద‌ర్శ‌క‌త్వంలో 'గుడ్ బై' సినిమా విడుద‌ల కానుంది. మాన‌వ సంబంధాల గురించి మ‌న‌సుకు హ‌త్తుకునే క‌థ‌గా 'గుడ్ బై' సినిమాను దర్శ‌కుడు తెర‌కెక్కించారు. 

మ‌ద‌ర్ సెంటిమెంట్ సినిమా!

'సీతారామం' సినిమాలో నెగెటీవ్ క్యారెక్ట‌ర్‌లో ర‌ష్మిక అద్భుతంగా న‌టించి ప్రేక్ష‌కుల మెప్పు పొందారు. ఇక 'గుడ్ బై' సినిమాలో ఎవ‌రిపై ఆధార‌ప‌డ‌కుండా త‌న కాళ్ల‌పై తాను నిలిబ‌డాల‌నుకునే అమ్మాయిగా ర‌ష్మిక న‌టించారు. కొత్త‌త‌రం ఆలోచ‌న‌ల‌ను క‌లిగిన అమ్మాయిగా తండ్రి అమితాబ్‌తో గొడ‌వ ప‌డుతుంటుంది. 

 ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) తల్లి పాత్ర‌లో నీనా గుప్తా న‌టించారు. ప్రేమ పంచే త‌ల్లి చ‌నిపోయిన త‌రువాత ఇంట్లో ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌వుతాయ‌నే క‌థ‌తో ఈ సినిమాను తెర‌కెక్కించారు వికాస్ బాల్.  ఈ చిత్రాన్ని శోభా క‌పూర్ ఏక్తాక‌పూర్‌లు నిర్మించారు. ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా 'గుడ్ బై' చిత్రం అక్టోబ‌ర్ 7న విడుద‌ల కానుంది.

'పుష్ప' సినిమాతో ర‌ష్మిక పాన్ ఇండియా హీరోయిన్‌గా మారారు. నార్త్‌లో ర‌ష్మికకు ఫాలోయింగ్ మ‌రింత పెర‌గింది. ఇక 'గుడ్ బై' చిత్రం రిలీజ్ త‌రువాత ఈ మ‌ల‌యాళ బ్యూటీ బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా మారుతుంద‌ని సినీ కిట్రిక్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Read More: 'గుడ్‌బై'తో ర‌ష్మిక బాలీవుడ్ ఎంట్రీ!.. బిగ్ బి, ర‌ష్మిక (Rashmika Mandanna)ల ఫ‌స్ట్ లుక్ రిలీజ్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!