కోబ్రా సినిమా కోసం చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే?

Updated on Aug 30, 2022 11:45 AM IST
చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) సినిమా దాదాపు మూడు సంవత్సరాల తర్వాత థియేటర్లలోకి రానుంది
చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) సినిమా దాదాపు మూడు సంవత్సరాల తర్వాత థియేటర్లలోకి రానుంది

అపరిచితుడు, ఐ, మల్లన్న సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు చియాన్ విక్రమ్ (Chiyaan Vikram). తమిళంలో స్టార్‌‌ హీరోగా ఉన్న విక్రమ్‌ సినిమాలకు టాలీవుడ్‌లో కూడా మంచి మార్కెట్‌ ఉంది. అయితే థియేటర్లలో విక్రమ్‌ సినిమా రిలీజై దాదాపు మూడు సంవత్సరాలు పూర్తయ్యింది. దీంతో విక్రమ్‌ అభిమానులు ఆయనను బిగ్‌ స్క్రీన్‌పై ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

విక్రమ్ నటించిన మహాన్‌ విడుదలైనా అది నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్‌ అయ్యింది. ప్రస్తుతం విక్రమ్ నటిస్తున్న సినిమా కోబ్రా. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న కోబ్రా సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. థ్రిల్లర్ జోనర్‌‌లో తెరకెక్కిన కోబ్రా సినిమా ఆగస్టు 31వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్‌ లుక్, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాయి. ఇదిలా ఉంటే తాజాగా విక్రమ్ రెమ్యున‌రేష‌న్‌కు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైర‌ల్ అవుతోంది.

చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) సినిమా దాదాపు మూడు సంవత్సరాల తర్వాత థియేటర్లలోకి రానుంది

బడ్జెట్‌లో 22 శాతమని టాక్..

కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం కోబ్రా సినిమాకు విక్రమ్ దాదాపు రూ.25 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్‌ను తీసుకున్నారని టాక్. ఈ రెమ్యున‌రేష‌న్ సినిమా బ‌డ్జెట్‌లో దాదాపుగా 22 శాతం అని తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం విక్రమ్ బాగానే క‌ష్టప‌డ్డారని సమాచారం. మ్యాథ‌మేటికల్ సైంటిస్ట్‌గా ఏడు విభిన్న గెటప్స్‌లో కోబ్రా సినిమాలో విక్రమ్ కనిపించనున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఏడు పాత్రల‌కు విక్రమ్ స్వయంగా డ‌బ్బింగ్ చెప్పారట‌.

ఈ క్రమంలోనే మేకర్స్ విక్రమ్ అడిగినంత పారితోషికాన్ని ఇచ్చార‌ని టాక్. కోబ్రా సినిమాలో విక్రమ్‌ (Chiyaan Vikram)కు జోడీగా ‘కేజీఎఫ్’ భామ‌ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించారు. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందించిన కోబ్రా సినిమాను సెవెన్ స్క్రీన్ స్డూడియోస్ ప‌తాకంపై ఎస్‌ఎస్‌ ల‌లిత్ కుమార్ నిర్మించారు.

Read More : Cobra: 'కోబ్రా' నుంచి మరో ట్రైలర్ రిలీజ్!.. యాక్ష‌న్ సీన్స్‌లో అద‌ర‌గొట్టిన విజ‌య్ (Chiyaan Vikram)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!