చియాన్ విక్రమ్ (Vikram) హీరోగా నటిస్తున్న ‘కోబ్రా’ సినిమా నుంచి అధీరా పాట రిలీజ్‌ ఎప్పుడంటే?

Updated on Jul 18, 2022 12:33 AM IST
చియాన్ విక్రమ్ (Vikram) కోబ్రా సినిమా పోస్టర్
చియాన్ విక్రమ్ (Vikram) కోబ్రా సినిమా పోస్టర్

చియాన్ విక్రమ్ (Vikram) హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘కోబ్రా’. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానుంది. కోబ్రా సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. యాక్షన్ థ్రిల్లర్‌‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్టు 11వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ క్రమంలో వరుస అప్‌డేట్‌లను ప్రకటిస్తోంది చిత్ర యూనిట్. తాజాగా మరో అప్‌డేట్‌ ఇచ్చింది.

కోబ్రా సినిమాలోని ‘అధీరా’ అంటూ సాగే స్పెష‌ల్ సాంగ్ తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. తమిళంలో విడుదల చేసిన అధీరా అనే పాట ప్రేక్షకులకు బాగా నచ్చింది. దాంతో ఈ పాట తెలుగు వెర్షన్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. సోమవారం సాయంత్రం 6 గంటలకు అధీరా తెలుగు పాటను విడుదల చేస్తోంది చిత్ర యూనిట్.

చియాన్ విక్రమ్ (Vikram) కోబ్రా సినిమా పోస్టర్

విలన్‌గా ఇర్ఫాన్ పఠాన్..

కోబ్రా సినిమాలో కేజీఎఫ్‌ భామ..శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సెవెన్ స్క్రీన్‌ స్టూడియోస్ పతాకంపై ఎస్‌ఎస్‌ లలిత్‌ కుమార్‌‌ ఈ సినిమాను నిర్మించారు. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కోబ్రా సినిమాలో విలన్‌గా నటించారు.

ఇక, ప్రస్తుతం విక్రమ్ (Vikram) నటించిన పొన్నియిన్ సెల్వన్ సినిమా మొదటి భాగం సెప్టెంబర్‌‌ 30వ తేదీన విడుదలవుతోంది. క్లాసికల్ డైరెక్టర్ మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఆదిత్య కరికాలన్‌గా విక్రమ్‌ నటించారు. 

Read More : మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘పొన్నియిన్ సెల్వన్‌’ (Ponniyin Selvan) సినిమాలో ఒక్క పాటకు అంత మంది డ్యాన్సర్లా!

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!