Shriya Saran: ఆ వ్యాధి బాధపెడుతున్నా రాజమౌళి (SS Rajamouli) షూట్ ఆపలేదు!.. జక్కన్నపై హీరోయిన్ శ్రియ ప్రశంసలు
ఒక సినిమా నిర్మాణం వెనుక ఎన్నో వందల మంది కష్టం దాగి ఉంటుంది. తెరపై కదిలే బొమ్మల వెనుక ఎంతో మంది కొన్ని వందల గంటల సమయం శ్రమిస్తారంటే నమ్మాల్సిందే. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని తట్టుకుని.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు చిత్రబృందం ఎంతగానో శ్రమిస్తారు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా సినిమా కోసం అన్నీ మర్చిపోతారు. కాల్షీట్స్, నిర్మాణ వ్యయాన్ని వృథా చేయొద్దు కాబట్టి ఎన్ని సమస్యలు చికాకు పెడుతున్నా పనిలో నిమగ్నమైపోతారు.
సినిమా విజయంలో తెర ముందు హీరోలు నటీనటులైతే.. తెరవెనుక హీరోలు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా డైరెక్టర్స్ ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి చిత్రాలను రూపొందిస్తారు. అలాంటి దర్శకుల్లో ఒకరు రాజమౌళి. క్రమశిక్షణకు ఆయన్ను మారుపేరుగా చెబుతుంటారు. ఒక సినిమా కోసం ఎంత కష్టపడటానికైనా, తాను అనుకున్న అవుట్‌పుట్ స్క్రీన్ మీద వచ్చే వరకు ఎంతగా చెమటోడ్చడానికైనా జక్కన్న వెనుకాడరని అంటుంటారు. అలాంటి రాజమౌళి ఓ సినిమా షూటింగ్‌లో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారట. ఈ విషయాన్ని స్టార్ హీరోయిన్ శ్రియ (Shriya Saran) ఇటీవల ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
రాజమౌళి ఓ పని మొదలుపెడితే ఏదీ పట్టించుకోరని శ్రియ అన్నారు. ‘నాకు తెలిసినంత వరకు ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం ప్రారంభానికి ముందు రాజమౌళి (SS Rajamouli) గారు ఆస్తమాతో బాధపడ్డారు. అయినా ఆయన ఏమీ పట్టించుకోలేదు. రాజమౌళి దృష్టి అంతా కథను ఎలా తెరకెక్కించాలనే దాని మీదే ఉంటుంది. సెట్ అంతా దుమ్ము, ధూళితో నిండిపోయి ఉన్నప్పటికీ ఆయన అలాగే వర్క్ చేస్తారు. తెరపై సినిమా అద్భుతంగా ఉండాలని ఆయన ఎంతగానో తాపత్రయపడతారు’ అంటూ రాజమౌళికి సినిమా అంటే ఎంత ఇష్టమో శ్రియ చెప్పుకొచ్చారు.
ఇకపోతే, ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) తర్వాత సూపర్‌స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేసేందుకు రాజమౌళి సిద్ధమవుతున్నారు. ఆ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని సమాచారం. జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ పనుల్లో బిజీగా ఉన్నారట. స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యాక ప్రీ ప్రొడక్షన్ పనుల్లో రాజమౌళి బిజీ అవుతారట. ‘ఆర్ఆర్ఆర్’తో దర్శకుడిగా పాన్ వరల్డ్ ఇమేజ్ సంపాదించిన జక్కన్న.. మహేష్ మూవీతో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారో చేస్తారో చూడాలి.
Read more: Balakrishna : "బాలయ్య" పేరుతో ప్రేక్షకులను అలరించిన సూపర్ హిట్ పాటలపై ప్రత్యేక కథనం