'ఆర్ఆర్ఆర్' (RRR) దర్శకుడికి మరో అరుదైన గౌరం.. అమెరికా న్యూస్ పేపర్ కవర్ పేజీపై ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli)

Updated on Nov 26, 2022 06:43 PM IST
హాలీవుడ్ లో చాలా మంది ప్రముఖులు ఇప్పటికే రాజమౌళిని (SS Rajamouli) పొగుడుతూ ట్వీట్స్ చేశారు. కొంతమంది డైరెక్ట్ గా కలిసి అభినందిస్తున్నారు.
హాలీవుడ్ లో చాలా మంది ప్రముఖులు ఇప్పటికే రాజమౌళిని (SS Rajamouli) పొగుడుతూ ట్వీట్స్ చేశారు. కొంతమంది డైరెక్ట్ గా కలిసి అభినందిస్తున్నారు.

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలతో పాటు ఈ సినిమాకు పలు అవార్డులు లభిస్తున్నాయి. దర్శకుడు రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమా తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. గ్లోబల్ వేదికలపై రాజమౌళి కనిపిస్తూ భారతీయ సత్తా చాటుతున్నారు. 

ఇటీవల హాలీవుడ్‌లో (Hollywood) ప్రతిష్టాత్మకంగా జరిగే గవర్నర్స్ అవార్డుల వేడుకలకు రాజమౌళి హాజరయ్యారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగే గవర్నర్స్ అవార్డుల కార్యక్రమంలో దర్శక ధీరుడు తళుక్కుమన్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవనాకి ముందు లాస్ ఏంజిల్స్‌లో గవర్నర్స్ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పలువురు అంతర్జాతీయ సినిమా దిగ్గజాలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.

భారతదేశం నుంచి గవర్నర్స్ అవార్డుల కార్యక్రమానికి రాజమౌళి (SS Rajamouli)కి ఆహ్వానం అందింది. నవంబర్ 19వ తేదీన జరిగిన ఈ వేడుకలకు రాజమౌళి హాజరయ్యారు. రాజమౌళి తన సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించి.. ప్రతీ భారతీయుడిని గర్వపడేలా చేశారు.  సూటుబూటులో కనిపించారు. సూపర్ స్టైలిష్‌గా కనిపించారు దర్శక ధీరుడు.

మరోవైపు హాలీవుడ్ లో చాలా మంది ప్రముఖులు ఇప్పటికే రాజమౌళిని (SS Rajamouli) పొగుడుతూ ట్వీట్స్ చేశారు. కొంతమంది డైరెక్ట్ గా కలిసి అభినందిస్తున్నారు. రాజమౌళికి హాలీవుడ్ లో గొప్ప ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రాజమౌళికి మరో అరుదైన గౌరవం లభించింది. అమెరికాలో ఎక్కువ సర్కులేషన్ ఉన్న పేపర్స్ లో ఒకటైన 'లాస్ ఏంజిల్స్ టైమ్స్' (Los Angeles Times) పత్రికలో రాజమౌళిపై స్పెషల్ ఆర్టికల్ రాశారు.

పత్రికలోని ముందు పేజీ పూర్తిగా రాజమౌళి ఆర్టికల్ కనిపిస్తోంది. అందులో జక్కన్నను.. 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని ప్రశంసిస్తూ.. ‘ఆర్ఆర్ఆర్’ దర్శకుడికి భారీ అవకాశాలు అంటూ హెడ్ లైన్ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. జక్కన్న పై ఆర్టికల్ రావడంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఒక టాలీవుడ్ దర్శకుడి గురించి అమెరికాలోని ప్రముఖ పత్రికలో మొదటి పేజీలో రావడం సినీ ప్రముఖులందరికీ పెద్ద విజయం అని చెప్పవచ్చు. భారతీయ సినిమాకు ఇది నిజంగా గర్వకారణం.

Read More: 'ఆర్ఆర్ఆర్'(RRR)ను ఆస్కార్ బరిలో నిలిపేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న రాజమౌళి(Rajamouli).. రూ.50కోట్లు ఖర్చు?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!