'ఆర్ఆర్ఆర్'(RRR)ను ఆస్కార్ బరిలో నిలిపేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న రాజమౌళి(Rajamouli).. రూ.50కోట్లు ఖర్చు?

Updated on Nov 25, 2022 12:58 PM IST
రాజమౌళి (SS Rajamouli) నేరుగా ఆస్కార్స్‌ బరిలో (RRR in Oscar Race) 'ఆర్‌ఆర్‌ఆర్‌'ను నిలపడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు.
రాజమౌళి (SS Rajamouli) నేరుగా ఆస్కార్స్‌ బరిలో (RRR in Oscar Race) 'ఆర్‌ఆర్‌ఆర్‌'ను నిలపడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు.

టాలీవుడ్‌ దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన చారిత్రక మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR). యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. పలువురు హాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ చిత్రాన్ని ప్రశంసించారు. అయినా ఈ చిత్రం ఆస్కార్ నామినేషన్లకు చేరలేకపోయింది. అయితే 'అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్' నిపుణులను ఆకట్టుకోవడానికి చిత్ర బృందం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 

రాజమౌళి నేరుగా ఆస్కార్స్‌ బరిలో (RRR in Oscar Race) 'ఆర్‌ఆర్‌ఆర్‌'ను నిలపడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ల కోసం ప్రపంచమంతా చుట్టేస్తున్నాడు. ఈ మధ్యే ఆస్కార్స్‌కు ముందు జరిగే గవర్నర్స్‌ అవార్డ్స్‌లోనూ పాల్గొన్నాడు. ఇప్పటికే అమెరికా, జపాన్‌లలో భారీ ఎత్తున ఈ సినిమాను ప్రమోట్‌ చేశాడు. ఈ క్రమంలోనే 'అకాడెమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌' ప్రొఫెషనల్స్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాడు.

హాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లతో కలిసి 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాను ఆస్కార్‌ బరిలో ఉండేట్టు ప్రయత్నాలు చేశాడు రాజమౌళి.

దీనికోసం రాజమౌళి (SS Rajamouli) కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో రాజమౌళికి ఓ బలమైన ఆయుధం లభించినట్టుగా తెలుస్తోంది. చాలా వరకు సినిమాలు ఆస్కార్ బరికి ఓటింగ్ సిస్టమ్ ద్వారా ఎంట్రీని సాధిస్తుంటాయి. ఇప్పడు దాన్నే ఆయుధంగా చేసుకుని జక్కన్న `RRR`ని ఆస్కార్ బరిలో దించాలని ప్లాన్ చేసుకుంటున్నాడట. ఈ ప్లాన్ లో భాగంగానే ఆస్కార్ ఓటింగ్ కు అర్హలైన బృందాలకు రాజమౌళి `RRR` ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయిస్తున్నాడు. 

హాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లతో కలిసి 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాను ఆస్కార్‌ బరిలో ఉండేట్టు ప్రయత్నాలు చేశాడు రాజమౌళి. అకాడమీ సభ్యుల ఓటింగ్ ఆస్కార్ అవార్డు ఫైనల్ అవుతుందని అందరికీ తెలిసిందే. ఇక ఈ ఓటింగ్‌ను రాజమౌళి (SS Rajamouli) మ్యానిపులేట్ చేసేట్టుగా కనిపిస్తోంది. దీని కోసం రూ.50 కోట్లు ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఈ సినిమాను ఇంకా ప్రపంచంలోని వివిద దేశాల్లో ప్రచారం చేస్తూనే ఉన్నాడు. మరి రాజమౌళి కష్టం ఫలిస్తుందా?.. ఆస్కార్ అవార్డు లభిస్తుందా? అన్నది ముందు ముందు చూడాలి.

Read More: జపాన్ లో 'ఆర్ఆర్ఆర్' (RRR) జైత్రయాత్ర మామూలుగా లేదుగా.. 17రోజుల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!