మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘గాడ్‌ఫాదర్’ సినిమా నుంచి మరో సాంగ్..రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించిన మేకర్స్

Updated on Sep 27, 2022 01:44 PM IST
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన ‘గాడ్‌ఫాదర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో బుధవారం జరగనుంది
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన ‘గాడ్‌ఫాదర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో బుధవారం జరగనుంది

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా న‌టించిన సినిమా 'గాడ్‌ఫాద‌ర్'. దసరా కానుకగా అక్టోబర్‌‌ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మెగాస్టార్ సినిమా విడుదల అవుతోందంటే చాలు అభిమానులకు పండుగే. ఇక, విజయ దశమి రోజునే చిరు నటించిన గాడ్‌ఫాదర్ సినిమా రిలీజ్‌ అవుతోందంటే మెగా అభిమానులకు డబుల్ ధమాకా అనే చెప్పాలి.

మలయాళ స్టార్‌‌ మోహన్‌లాల్‌ హీరోగా నటించిన లూసిఫర్ సినిమాకు రీమేక్‌గా గాడ్‌ఫాదర్‌‌ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు మోహన్‌రాజా దర్శకత్వం వహించగా.. ఎస్‌ఎస్‌ థమన్ సంగీతం అందించారు. ఇక, ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మెగాస్టార్ ఫస్ట్‌ లుక్, టీజర్, సాంగ్స్‌ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి. అంతేకాదు సినిమాపై అంచనాలను కూడా భారీగా పెంచేశాయి

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన ‘గాడ్‌ఫాదర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో బుధవారం జరగనుంది

పోస్టర్‌‌ కూడా విడుదల..

గాడ్‌ఫాదర్ సినిమాలో మెగాస్టార్‌‌.. పొలిటికల్‌ లీడర్‌‌గా కనిపించనున్నారు. సినిమాలో ఆయన లుక్స్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. గాడ్‌ఫాదర్ సినిమాలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్, లేడీ సూపర్‌‌స్టార్ నయనతార, సత్యదేవ్, సముద్రఖని, సునీల్, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషించారు. సూపర్‌‌గుడ్‌ ఫిలింస్, కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్లు సంయుక్తంగా గాడ్‌ఫాదర్‌‌ సినిమాను రూపొందించాయి. ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమాకు ‘యు / ఎ’ సర్టిఫికెట్‌ను అందించారు సెన్సార్ బోర్డు అధికారులు.  

గాడ్‌ఫాదర్‌‌ సినిమా నుంచి మరో సాంగ్‌ను ఈరోజు సాయంత్రం 5:04 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు మేకర్స్ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ సినిమాలో ‘నజభజ’ అనే పాటను రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్‌‌ను ట్విట్టర్‌‌లో పోస్ట్‌ చేసింది చిత్ర యూనిట్. ఇక, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన గాడ్‌ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సెప్టెంబర్‌‌ 28వ తేదీన సాయంత్రం 6 గంటలకు అనంతపురంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో నిర్వహించనున్నారనే విషయం తెలిసిందే.

Read More : God Father : 'గాడ్ ఫాదర్' చిత్రంలో చిరంజీవి పలికిన ఆసక్తికరమైన పొలిటికల్ డైలాగ్ ఇదే.. వైరల్ అవుతున్న వీడియో !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!