అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హను (Allu Arha) ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram)..!

Published on Oct 03, 2022 06:16 PM IST

టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిన స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah).. తన జీవితాన్ని సినీ పరిశ్రమకి అంకితం చేసిన గొప్ప వ్యక్తి, దివంగత నటుడు. ఆయన శత జయంతి ఉత్సవాలు ఇటీవల ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరై అల్లు స్టూడియోస్ (Allu Studios)ను ప్రారంభించారు.

అనంతరం రామలింగయ్య విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ వేడుకకు అల్లు ఫ్యామిలీతో పాటు చిరంజీవి (Megastar Chiranjeevi), ఆయన సతీమణి సురేఖ హాజరయ్యారు. కోకాపేటలో 10ఎకరాల్లో అల్లు స్టూడియోస్‌ను భారీ స్థాయిలో నిర్మించారు. అత్యాధునిక టెక్నాలజీతో.. ప్రపంచ స్థాయి సదుపాయాలు ఈ స్టూడియోలో అందుబాటులో ఉన్నాయి. సినిమాకు సంబంధించి అన్ని పనులు ఇక్కడే చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. షూటింగ్స్‌కు సంబంధించిన బిల్డింగ్‌ పనులు కూడా పూర్తి కావడంతో.. చిత్రీకరణకు ఈ స్టూడియో అందుబాటులోకి వచ్చింది.

అల్లు స్టూడియోస్ (Allu Studios) ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడిన మాటలు, ఆ మహానుభావుణ్ని మరింత గొప్పగా ప్రెజెంట్ చేశాయి. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ (Allu Arha), త్రివిక్రమ్ శ్రీనివాస్ కూర్చొని ఉండగా అక్కడికి వెళ్ళి ఆయనకు ముద్దు పెట్టింది. అంతకుముందు త్రివిక్రమే ఆప్యాయంగా ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుని ముద్దడిగాడు. 

అయితే, అర్హ అలా ముద్దు పెట్టగానే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ఇచ్చిన రియాక్షన్.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పక్కనే ఉన్న బ్రహ్మానందం, త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద అక్కడికక్కడ సెటైర్ వేసేశారు. ఇక, త్రివిక్రమ్ ఎక్స్‌ప్రెషన్ నేపథ్యంలో.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.

Read Moer: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) భార్య స్నేహా రెడ్డి బర్త్ డే సందర్భంగా బన్నీ స్పెషల్ విషెస్..!