పుష్ప2 తర్వాత అల్లు అర్జున్‌(Allu Arjun)తో సినిమా చేయాలని త్రివిక్రమ్(Trivikram Srinivas) ప్లాన్ చేస్తున్నారా?

Updated on Sep 09, 2022 08:23 PM IST
అల్లు అర్జున్‌తో అల వైకుంఠపురములో సినిమా తర్వాత మహేష్‌బాబుతో సినిమా చేస్తున్నారు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ (Trivikram Srinivas)
అల్లు అర్జున్‌తో అల వైకుంఠపురములో సినిమా తర్వాత మహేష్‌బాబుతో సినిమా చేస్తున్నారు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ (Trivikram Srinivas)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం పుష్ప2 సినిమా చేస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప సినిమాకు సీక్వెల్‌గా పుష్ప2 తెరకెక్కనుంది. పుష్ప సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్‌‌గా పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా విజయంతో పుష్ప2 సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ (Trivikram Srinivas) ప్రస్తుతం సూపర్‌‌స్టార్ మహేష్‌బాబుతో సినిమా చేస్తున్నారు. ఎస్‌ఎస్‌ఎంబీ28 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘అల వైకుంఠపురములో’.

అల్లు అర్జున్‌తో అల వైకుంఠపురములో సినిమా తర్వాత మహేష్‌బాబుతో సినిమా చేస్తున్నారు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ (Trivikram Srinivas)

మరో సినిమాకు ప్లాన్..

ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. అల వైకుంఠపురములో సినిమా తర్వాత అల్లు అర్జున్‌ (Allu Arjun) పుష్ప సినిమాలో నటించారు. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అయితే అల వైకుంఠపురములో సినిమా తర్వాత త్రివిక్రమ్ ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు. తాజాగా మహేష్‌బాబుతో సినిమాను మొదలుపెట్టారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. రెండు మూడు రోజుల్లో షూటింగ్‌ కూడా మొదలుకానుంది. ఎస్‌ఎస్‌ఎంబీ28 సినిమా పూర్తయిన తర్వాత మహేష్‌బాబు.. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో సినిమా చేయనున్నారు.

అలాగే పుష్ప2 సినిమా పూర్తయిన తర్వాత అల్లు అర్జున్‌.. త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్. అల్లు అర్జున్‌ (Allu Arjun)తో మరో సినిమా తెరకెక్కించాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) చేస్తున్న మాస్టర్ ప్లాన్‌ వర్కవుట్ అవుతుందా లేదా చూడాలి మరి.

Read More : అల్లు అర్జున్ (Allu Arjun) క్రేజ్ మామూలుగా లేదుగా.. బన్నీని పొగడ్తలతో ముంచెత్తిన హీరోయిన్‌ జాన్వీ కపూర్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!