త్రివిక్రమ్ (Trivikram Srinivas)తో హాలీవుడ్ రేంజ్ సినిమా చేస్తా: నాగవంశీ

Updated on Oct 06, 2022 11:46 PM IST
ప్రపంచమంతా త్రివిక్రమ్ (Trivikram Srinivas) వైపు చూసేలా ఓ సినిమా చేయాలని ఉందని నాగవంశీ (Naga Vamsi) ఒక ఇంటర్వ్యూలో  అన్నారు  
ప్రపంచమంతా త్రివిక్రమ్ (Trivikram Srinivas) వైపు చూసేలా ఓ సినిమా చేయాలని ఉందని నాగవంశీ (Naga Vamsi) ఒక ఇంటర్వ్యూలో  అన్నారు  

‘జెర్సీ’, ‘డీజే టిల్లు’, ‘భీష్మ’, ‘ప్రేమమ్’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ అతి తక్కువ సమయంలో అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఈ బ్యానర్ నుంచి ‘స్వాతిముత్యం’ అనే చిత్రం రాబోతోంది. 

దసరా పండుగ కానుకగా ఈనెల 5వ తేదీన ‘స్వాతిముత్యం’ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ (Trivikram Srinivas)తో హాలీవుడ్ రేంజ్‌లో ఒక భారీ చిత్రాన్ని రూపొందించే ప్లాన్ ఉందని తెలిపారు. 

బడ్జెట్ బారియర్స్ లేకుండా తీస్తాం

నిర్మాణ ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా, ప్రపంచమంతా త్రివిక్రమ్ వైపు, తమ బ్యానర్ వైపు తిరిగిచూసేలా భారీ ప్రాజెక్టు చేసే ఆలోచన ఉందని నాగవంశీ (Naga Vamsi) చెప్పారు. హారికా హాసిని సంస్థ నిర్మాణంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా తీయాలని ఉందన్నారు. ఎప్పటికైనా త్రివిక్రమ్‌తో హాలీవుడ్ రేంజ్ సినిమా తీయాలన్నది తన కోరిక అన్నారు. అయితే అది ఎలాంటి సినిమా అనేది సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తామన్నారు. 

ప్రభాస్, చెర్రీతోనూ సినిమాలకు ప్లాన్

త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ప్రభాస్ (Prabhas)), రామ్ చరణ్‌ (Ram Charan)లతోనూ చెరో చిత్రాన్ని తీసే ఆలోచన ఉందని నాగవంశీ పేర్కొన్నారు. ప్రస్తుతం మహేష్‌తో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఎస్ఎస్ఎంబీ 28 గురించి కూడా ఆయన ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుందన్నారు. ఈ మూవీ మార్కెట్ ఏ రేంజ్‌లో ఉంటుందనేది ఇప్పుడే అంచనా వేయలేమన్నారు.  

ఇక స్వాతిముత్యం సినిమా గురించి నాగవంశీ మాట్లాడుతూ.. స్పెర్మ్ డొనేషన్ అనే పాయింట్ ఆధారంగా ఈ చిత్రాన్ని తీశామన్నారు. కుటుంబ సభ్యులంతా కలసి చూసే విధంగా ఈ మూవీ ఉంటుందన్నారు.  

Read more: మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ‘అయోధ్యలో అర్జునుడు’? పరిశీలిస్తున్న చిత్ర యూనిట్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!