Ram Charan: రామ్ చరణ్ ఫ్యాషన్ ట్రెండ్ ఫాలో అవరు.. ట్రెండ్ సెట్ చేస్తారు!

Updated on Nov 13, 2022 01:47 PM IST
రామ్ చరణ్ (Ram Charan) స్టైలిష్ లుక్స్ సోషల్ మీడియాలో ప్రతి రోజు వైరల్ అవుతుండటం విశేషం.
రామ్ చరణ్ (Ram Charan) స్టైలిష్ లుక్స్ సోషల్ మీడియాలో ప్రతి రోజు వైరల్ అవుతుండటం విశేషం.

టాలీవుడ్ యంగ్ హీరోలలో  రామ్ చరణ్ (Ram Charan) కాస్టూమ్స్ ప్రత్యేకంగా ఉంటాయి. ట్రెండ్ కు తగ్గట్లుగా రామ్ చరణ్ తన కాస్టూమ్స్ ను ఎంచుకుంటారు. కొత్త లుక్ తో ఎప్పటికప్పుడు అభిమానులకు కనువిందు చేస్తుంటారు మెగా పవర్ స్టార్. రామ్ చరణ్ వెళ్లే ఈవెంట్స్ లలో, ఫంక్షన్లలో లేదా విదేశీ టూర్లలో.. ఆయనతో పాటు కాస్టూమ్స్, మేకప్ కూడా  ప్రత్యేక ఆకర్షణగా అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. అంతేకాదు రామ్ చరణ్ స్టైలిష్ లుక్స్ సోషల్ మీడియాలో ప్రతి రోజు వైరల్ అవుతుండటం విశేషం. ఈ మధ్య కాలంలో రామ్ చరణ్ ధరించిన డ్రెస్సులపై మనమూ ఓ లుక్ వేద్దాం.

 

రామ్ చరణ్ (Ram Charan)

ఢిల్లీలో జరిగిన హెచ్.టీ లీడర్ షిప్ సమ్మిట్ లో రామ్ చరణ్ లేటెస్ట్ టెండ్రీ లుక్ లో కనిపించారు. లైట్ బ్లూ కలర్ షర్ట్, బ్రౌన్ కోట్, బ్రౌన్ సన్ గ్లాసెస్ తో మోస్ట్ హ్యాండ్సమ్ గా కనిపించారు.

రామ్ చరణ్ (Ram Charan)

హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన రామ్ చరణ్ వైట్ డ్రెస్ తో ఎయిర్ పోర్టులో కనిపించారు. వైట్ అండ్ పింక్ డ్రెస్ లో కూల్ గా కనిపించారు. బ్లాక్ సన్ గ్లాసెస్ తో మరింత స్టైలిష్ గా కనిపించారు. 

రామ్ చరణ్ (Ram Charan)

'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రమోషన్ల కోసం రామ్ చరణ్ జపాన్ వెళ్లారు. జపాన్ లో రామ్ చరణ్ కాస్టూమ్స్ ఆకట్టుకున్నాయి. జపాన్ దేశానికి తగ్గట్టుగా రామ్ చరణ్ కనిపించారు. జపాన్ హీరో అంటే నమ్మేలా తన కాస్టూమ్స్, మేకప్ ను సెట్ చేసుకున్నారు. 

రామ్ చరణ్ (Ram Charan)

ఉపాసనతో కలిసి వెళ్లే ప్రోగ్రామ్స్ కు తన భార్యతో మ్యాచింగ్ అయ్యేలా రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. ఉపాసన, రామ్ చరణ్ కలిసి ఉన్న ఫోటోలను చూస్తే ఇద్దరి కాస్టూమ్స్ కాంబినేషన్ ఎంతో మందికి నచ్చేలా ఉంటుంది. 

రామ్ చరణ్ (Ram Charan)

రామ్ చరణ్ రీసెంట్ గా భార్య ఉపాసనతో కలిసి ఆఫ్రికా ట్రిప్ వెళ్లారు. అక్కడ రామ్ చరణ్ వేసుకున్న కాస్టూమ్స్ డిఫరెంట్ గా కనిపించాయి.  

రామ్ చరణ్ (Ram Charan)

రామ్ చరణ్, ఉపాసనల పెళ్లై పది సంవత్సరాలు పూర్తవుతుంది. పదేళ్ల వీరి బంధానికి గుర్తుగా రామ్ చరణ్ , ఉపాసనలు విదేశాల్లో వేడుకలు చేసుకున్నారు. ఇటలీలో మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకున్నారు.  గ్రే కోట్ , వైట్ షర్ట్ లో రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి దిగిన పిక్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి.

రామ్ చరణ్ (Ram Charan)

రామ్ చరణ్ తన పెళ్లి రోజు ఇటలీలో చేసుకునేందుకు వెళ్లే సమయంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కెమెరా కంటికి చిక్కారు. డెనిమ్ జాకెట్ లో రామ్ చరణ్ తళుక్ మన్నారు. అప్పట్లో రామ్ చరణ్ వేసుకున్న డెనిమ్ జాకెట్ తెగ వైరల్ అయింది. ఆ డ్రెస్ కోసం ఆన్ లైన్ లో తెగ సెర్చ్ చేశారు. 

రామ్ చరణ్ (Ram Charan)

రామ్ చరణ్ ధరించిన డెనిమ్ జాకెట్ ధర రెండు లక్షల రూపాయలకు పైగా ధర ఉంటుందట. రామ్ చరణ్ ధరించిన ఆ డెనిమ్ జాకెట్ 'డ్రెస్ ఆఫ్ ద ఇండస్ట్రీ' అంటూ తెగ వైరల్ చేేశారు అభిమానులు.

రామ్ చరణ్ (Ram Charan)

రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC 15 చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా కియారా అద్వానీ నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ లు నిర్మిస్తున్నారు. 

రామ్ చరణ్ (Ram Charan)

'ఆర్ఆర్ఆర్' సినిమా తరువాత రామ్ చరణ్ కు ప్రపంచ స్థాయిలో అభిమానులు పెరిగారు. మెగా పవర్ స్టార్ మరింత స్టైలిష్ గా కనిపించడంతో ఫాన్స్ తెగ సంతోషపడుతున్నారు. రామ్ చరణ్ ను #ManofMassesRamcharan #Ramcharan హ్యాష్ ట్యాగ్లతో  ట్రెండ్ చేస్తున్నారు.   

Read More: Ram Charan: సినీ 'రంగస్థలం'పై 'మగధీరుడి' సత్తా ! మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సాధించిన అవార్డులపై స్పెషల్ స్టోరీ !

 

రామ్ చరణ్ (Ram Charan)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!