God Father: ‘గాడ్‌ఫాదర్’ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్!.. చిరు (Chiranjeevi), సల్మాన్‌ల స్టెప్పులు చూడాల్సిందే..
God Father: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 'ఆచార్య' డిజాస్టర్ తరువాత పలు సినిమాల్లో నటిస్తున్నారు. ప్రేక్షకులతో పాటు అభిమానులకు వరుస సినిమాలతో వినోదం పంచాలని నిర్ణయించుకున్నారు. ఇదే క్రమంలో చిరంజీవి, సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'గాడ్‌ఫాదర్' సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమోను, ఓ ప్రత్యేక గీతాన్ని మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించిన పాట ప్రోమోను చూసేందుకు, ఇరువురి అభిమానులు ఆతృతగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మెగా జాతర
'గాడ్‌ఫాదర్' సినిమా నుండి మొదటి పాట ప్రోమోను ఈ రోజు సాయంత్రం 4:05 గంటలకు మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి ఉన్న పోస్టర్‌ను మేకర్స్ సామాజిక మాధ్యమాల్లో రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ గురించి ఫ్యాన్స్ అనేక వ్యాఖ్యలు చేస్తున్నారు . ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి డాన్స్ చేస్తే, ఇక థియేటర్లలో రచ్చే అంటున్నారు అభిమానులు.
ఇప్పటికే చిరంజీవి (Chiranjeevi), సల్మాన్ ఖాన్‌ల పై ప్లాన్ చేసిన పలు సీన్లతో పాటు, ఓ స్పెషల్ సాంగ్‌ను హైదరాబాద్, ముంబై నగరాల్లో చిత్రీకరించారు. ఈ ప్రత్యేక జీతంలో చిరు, సల్మాన్‌లు "నువ్వా నేనా" అన్నట్లుగా మాస్ స్టెప్పులతో అదరగొట్టారని టాక్. 'గాడ్‌ఫాదర్' సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమోను మేకర్స్ ఈ రోజే రిలీజ్ చేయనున్నారు.
ఓ రేంజ్‌లో నయన్ పాత్ర
మలయాళ చిత్రం 'లూసిఫర్'కు రీమేక్‌గా 'గాడ్ ఫాదర్' తెరకెక్కుతోంది. 'గాడ్‌ఫాదర్'లో సాత్ స్టార్ హీరోయిన్ నయనతార కూడా నటించడం విశేషం. ఈ సినిమాలో నయనతార ఫస్ట్ లుక్‌ను ఇటీవలే మేకర్స్ రిలీజ్ చేశారు. 'సైరా'లో చిరంజీవి (Chiranjeevi) సతీమణిగా నటించిన నయనతార.. 'గాడ్ ఫాదర్'లో ఆయనకు చెల్లెలుగా నటిస్తున్నారు.ఈ సినిమాలో 'సత్యప్రియ జయదేవ్' పాత్రలో నయన్ కనిపించనున్నారు.
సత్యదేవ్ ఫస్ట్ లుక్ అదుర్స్
'గాడ్‌ఫాదర్' సినిమా నుంచి నటుడు సత్యదేవ్ ఫస్ట్ లుక్‌ను కూడా మేకర్స్ ఇటీవలే రిలీజ్ చేశారు . ఉమా మహేశ్వర ఉగ్ర రూపాస్య, తిమ్మరుసు, బ్లఫ్ మాస్టర్ లాంటి సినిమాలతో సత్యదేవ్ పాపులర్ అయ్యారు. ఇటీవలే "ఆచార్య" సినిమాలో చిరంజీవి గురువు పాత్రలో నటించారు. ఇప్పుడు "గాడ్ ఫాదర్" చిత్రంలో సత్యదేవ్ "జయదేవ్" పాత్రలో నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ లో రాజకీయ నేతగా చాలా హుందాగా కనిపించారు సత్యదేవ్.
చిరంజీవి భార్య కొణిదెల సురేఖ 'గాడ్‌ఫాదర్' సినిమాను సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆర్‌బీ చౌదరి, ఎన్‌వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అలాగే తమన్ సంగీతం అందిస్తున్నారు. 'గాడ్ ఫాదర్' అక్టోబర్ 5 తేదీన దసరా కానుకగా విడుదల కానుంది.
Read More:God Father: 'గాడ్‌ఫాదర్' సినిమా చూసి చిరంజీవి (Chiranjeevi) ఏమన్నారు?. దర్శకుడికి చిరు సలహా