Exclusive : ఈ కథ చాలా ముఖ్యమైన కథ, అందరూ తెలుసుకోవాల్సిన కథ.. ఇదే మహేష్ బాబు (Mahesh Babu) మదిలోని మాట !

Updated on Jun 01, 2022 11:50 AM IST
ఇప్పటికి దేశంలో చాలా చోట్ల ఈ సినిమాను టెస్ట్ స్క్రీనింగ్ చేశాం. దాదాపు ప్రతిచోటా మాకు మంచి స్పందనే వచ్చింది" అని మహేష్ బాబు (Mahesh Babu) తన మదిలోని మాటను బయటపెట్టారు. 
ఇప్పటికి దేశంలో చాలా చోట్ల ఈ సినిమాను టెస్ట్ స్క్రీనింగ్ చేశాం. దాదాపు ప్రతిచోటా మాకు మంచి స్పందనే వచ్చింది" అని మహేష్ బాబు (Mahesh Babu) తన మదిలోని మాటను బయటపెట్టారు. 

Mahesh Babu: మహేష్ బాబు ఇటీవలే పింక్‌విల్లా టీమ్‌తో తన మదిలోని మాటలను పంచుకున్నారు. ఎన్నో విషయాలను పూస గుచ్చినట్లు తెలిపారు. నటుడిగానే కాకుండా, నిర్మాతగా కూడా తన అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా 'మేజర్' సినిమా నిర్మాణ బాధ్యతలను ఎందుకు, ఎలా తీసుకోవాల్సి వచ్చిందో కూడా పేర్కొన్నారు. 

ఈ క్రెడిట్ అంతా అడివి శేష్‌కే దక్కాలి

'అడివి శేష్ మా వద్దకు తొలుత ఈ సినిమా గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు, నమ్రత స్క్రిప్ట్ గురించి అడిగింది. కానీ నాకు దాని అవసరం కూడా లేదనపించింది. ఎందుకంటే ఇది అందరూ తెలుసుకోవాల్సిన కథ. చాలా ముఖ్యమైన కథ. ఈ కథతో జనాల భావోద్వేగాలు మిళితమై ఉన్నాయి. మేజర్ (Major) సందీప్ ఉన్నిక్రిష్ణన్ లాంటి వ్యక్తి గురించి సినిమా తీయడం అంటే మాటలు కాదు. కానీ అడివి శేష్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. 

అడివి శేష్ (Adivi Sesh) గతంలో నటించిన సినిమాలను కొన్ని చూశాను. ఎవరు, గూఢాచారి సినిమాలు నాకు చాలా బాగా నచ్చాయి. అలాగే డైరెక్టర్ శశి గురించి కూడా బాగా తెలుసు. అందుకే, అనురాగ్ & శరత్ నా వద్దకు వచ్చి ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడినప్పుడు వెంటనే ఒప్పుకున్నాను.

అమీర్ ఖాన్ అలా ఎందుకు చేస్తారో తెలుసుకున్నాం

ఈ సినిమాతో తొలిసారిగా తెలుగులో టెస్ట్ స్ర్కీనింగ్ పద్ధతికి శ్రీకారం చుట్టాం. అమీర్ ఖాన్ లాంటి వ్యక్తులు ఎందుకు ఇలాంటి పద్ధతిని ఎప్పుడూ ఫాలో అవుతుంటారో అప్పుడు మాకు అర్థమైంది. ఈ పద్దతి ద్వారా సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల నాడిని తెలుసుకొనే అవకాశం కచ్చితంగా ఉంటుంది. అలాగే ప్రేక్షకులు మన నుండి ఏం కోరుకుంటున్నారో కూడా తెలుస్తుంది. ప్రయోగాత్మకమైన పద్దతి అయినప్పటికీ కూడా, మేం ఈ కొత్త పద్దతికి శ్రీకారం చుట్టాం. దేశంలో చాలా చోట్ల మేజర్ సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శించాం. 

ఇది అత్యుత్తమ సినిమాటిక్ అనుభవం 

సాధారణంగా ఏ సినిమానైనా సరే, ఎడిటింగ్ జరిగాక మన సన్నిహితులకు, స్నేహితులకు చూపిస్తారు. కానీ, ప్రేక్షకులలో కొందరికి టెస్ట్ స్క్రీనింగ్ ద్వారా ఆ అవకాశం కల్పించడం అనేది గొప్ప అనుభూతి. 

మేజర్ (Major) విషయంలో అది వర్కవుట్ అయ్యింది కూడా. జనాలు కూడా ఆ సినిమాటిక్ అనుభవాన్ని పొంది, ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికి దేశంలో చాలా చోట్ల ఈ సినిమాను టెస్ట్ స్క్రీనింగ్ చేశాం. దాదాపు ప్రతిచోటా మాకు మంచి స్పందనే వచ్చింది" అని మహేష్ బాబు (Mahesh Babu) తన మదిలోని మాటను బయటపెట్టారు. 

అలాగే మహేష్ బాబు (Mahesh Babu) మరో ప్రశ్నకు కూడా సమాధానమిచ్చారు. తన గత సినిమాలు అయిదు కూడా రూ.100 కోట్ల వసూళ్లను అధిగమించాయి కాబట్టి, తన తదుపరి చిత్రాల మీద కూడా ఆ ఒత్తిడి ఉంటుందా? అనే ప్రశ్నకు ఆయన లౌక్యంగా జవాబిచ్చారు. తన భవిష్యత్ సినిమాలపై, కలెక్షన్లకు సంబంధించి అంత ఒత్తిడి ఉంటుందని అనుకోవడం లేదన్నారు.

Read : నాన్న‌కు ప్రేమ‌తో అంటూ.. తండ్రి సూప‌ర్ స్టార్ కృష్ణ (Krishna)కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన మ‌హేష్ బాబు (Mahesh Babu) 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!