'మేజ‌ర్' (Major) ట్రైల‌ర్ పై సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌శంస‌లు!

Published on May 10, 2022 05:13 PM IST

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు ఓ పక్క తన సినిమా ‘సర్కారు వారి పాట’ ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు. మరోవైపు ఆయ‌న నిర్మించిన‌ ‘మేజర్’ (Major) సినిమాని సైతం ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. కాగా, ఈ సినిమాలో యంగ్ హీరో అడివి శేష్ మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణన్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. 2011లో ముంబైలో కసబ్ గ్యాంగ్ చేసిన అటాక్ లో ఇతను ప్రాణ త్యాగం చేశాడు. ఆయ‌న‌ పర్సనల్ లైఫ్.. ఆర్మీలోకి ఎలా వచ్చాడు వంటి మనకి తెలియని ఎన్నో అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ విష‌యాన్ని ట్రైలర్ ద్వారా చెప్పకనే చెప్పారు. ఇక ‘మేజర్’ ట్రైలర్ లాంచ్ కు గెస్ట్ గా విచ్చేసిన మహేష్ బాబు.. ఈ సినిమా సూపర్ హిట్ అంటూ కామెంట్ చేశారు. దీంత  ఇప్పుడు ఈ వ్యాఖ్య‌లు వైరల్ అవుతున్నాయి. అభిమానుల సమక్షంలో విడుదల చేసిన ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ… ‘మేజర్’ (Major) టీమ్ ని చూస్తే గర్వంగా ఉంద‌ని అన్నారు.

ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ప్రేక్షకుల రియాక్షన్ చూసి చాలా హ్యాపీగా అనిపించిన‌ట్లు పేర్కొన్నారు. అయితే, ఈ మూవీ చూశానని.. కొన్ని సీన్లు చూస్తున్నపుడు గూజ్ బంప్స్ వచ్చాయని తెలిపారు. చివరి 30 నిమిషాలు నా గొంతు తడారిపోయినట్టు అయ్యిందని.. సినిమా పూర్తయిన తర్వాత ఏం మాట్లాడలేకపోయానని... రెండు నిమిషాల మౌనం తర్వాత శేష్ ని హగ్ చేసుకున్నానని పేర్కొన్నారు. అయితే.. బయోపిక్ తీయడం చాలా బాధ్యతతో కూడుకున్న అంశం.. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లాంటి వీరుడి కథ చెప్పినప్పుడు ఆ బాధ్యత ఇంకా పెరుగుతుందని అన్నారు.

‘మేజర్’ (Major) టీం మొత్తం ఆ భాద్యతని చక్కగా నిర్వహించారని ప్ర‌శంసించారు. రెండేళ్ళుగా ‘మేజర్’ టీమ్ నాకు థాంక్స్ చెబుతున్నారు. కానీ ఇంత గొప్ప సినిమాని ఇచ్చిన ‘మేజర్’ టీమ్ కి నేను థ్యాంక్స్ చెప్పాలి. జూన్ 3న ‘మేజర్’ వస్తుంది. తప్పకుండా మీరు ప్రేమించే సినిమా అవుతుంది. అనురాగ్ ఇందాక మాట్లాడుతూ నేను రిస్క్ చేస్తానని చెప్పారు. కానీ నేను రిస్క్ చేయను. నాలుగేళ్లుగా నేను ఏది పట్టుకున్నా బ్లాక్ బస్టరే. అడవి శేష్ చేసే సినిమాలు నాకు చాలా ఇష్టం. ‘మేజర్’ సినిమా గా కూడా అద్భుతంగా ఉండబోతుంది” అంటూ చెప్పుకొచ్చాడు మహేష్ బాబు. ఇక‌, ఈ కార్య‌క్ర‌మంలో మేజ‌ర్ సినిమా యూనిట్ స‌భ్యులంద‌రూ పాల్గొన్నారు.