‘మేజర్’ సినిమా టికెట్ల కోసం క్యూలో మహేష్‌బాబు (MaheshBabu).. వీడియో వైరల్

Updated on Jun 04, 2022 02:27 PM IST
మహేష్‌బాబు (MaheshBabu), నిహారిక, అడివి శేష్
మహేష్‌బాబు (MaheshBabu), నిహారిక, అడివి శేష్

26/11 ముంబై ఉగ్ర దాడుల్లో వీర మరణం పొందిన జవాను సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత కథతో తెరకెక్కించిన సినిమా 'మేజర్‌'. శశికిరణ్‌ తిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మహేష్‌బాబు (MaheshBabu) కూడా ఒక నిర్మాత.  పాన్‌ ఇండియన్‌ మూవీగా జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది.

అయితే  ‘మేజర్’ సినిమాను పది రోజుల ముందుగానే, దేశంలోని 9 ప్రధాన నగరాల్లో ప్రివ్యూ షో వేస్తున్నారు. ఈ క్రమంలో మే 24 నుంచి రోజుకో సిటీలో మేజర్‌ మూవీ ప్రివ్యూలను ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌ను డిఫరెంట్‌గా నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. ఈ ప్రమోషన్స్‌లో సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు టికెట్ల కోసం క్యూలో నిలుచున్న వీడియో, ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మహేష్‌బాబు ఏంటి..? టికెట్ల కోసం లైన్‌లో నుంచోవడం ఏమిటి అనుకుంటున్నారా? కాకపోతే, అది ప్రమోషన్‌ కోసం చేసిన వీడియో బాస్!

ప్రముఖ యూట్యూబర్ నిహారిక ఎన్‌ఎమ్‌తో కలిసి.. మహేష్‌బాబు, అడివి శేష్‌ ఒక యూట్యూబ్‌ వీడియో చేశారు. ఈ వీడియోలో ‘ఇది మేజర్ సినిమా టికెట్ల లైనే కదా’ అని ఒక వ్యక్తిని అడుగుతుంది నిహారిక. ‘అవును‘ అని చెప్తాడు ఆ వ్యక్తి. ఆమె లైన్‌లో నిలుచుని ఉండగా.. టికెట్ల కోసం తర్వాత వచ్చిన వాళ్లందరూ నిహారిక ముందర నిలుచుంటారు. అడివి శేష్‌ కూడా వచ్చి నిహారిక ముందర నిలుచుంటాడు. దాంతో శేష్‌తో గొడవపడుతుంది. గొడవ పడుతూ శేష్‌ను వెనక్కి పంపి ముందుకు వచ్చి నిలుచుంటుంది.

ఈ గొడవ జరుగుతున్న సమయంలో మరో వ్యక్తి వచ్చి లైన్‌లో నిహారిక ముందు నిలుచుంటాడు. ఆ వ్యక్తిని పిలిచి ‘లైన్‌ వెనుక ఉంది. అక్కడ నుంచోవాలి‘ అని చెప్పాలని అనుకుంటుంది. ఇంతలో ఆ వ్యక్తి వెనక్కి తిరుగుతాడు. దాంతో నిహారిక ఏం మాట్లాడకుండా చూస్తూ ఉండిపోతుంది. ఆ వ్యక్తి మరెవరో కాదు ‘మహేష్‌బాబు‘. మహేష్‌ను చూసి ఆశ్చర్యపోయిన నిహారిక.. ‘మీరెక్కడ నిలుచుంటే, అక్కడి నుంచే లైన్ స్టార్ట్ అవుతుందని‘ చెప్తుంది. దానికి మహేష్‌ (MaheshBabu) ‘నా ఫ్రెండ్స్‌ని కూడా లైన్‌లోకి పిలవమంటారా‘ అని అడుగుతాడు. దానికి ‘ఓకే‘ చెప్పిన నిహారిక.. ‘మీ ఫోన్‌ నంబర్ చెప్తారా‘ అని అడిగే ప్రయత్నం చేస్తుంది.ఇంతలో మహేష్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఫన్నీగా సాగిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!