నాన్న‌కు ప్రేమ‌తో అంటూ.. తండ్రి సూప‌ర్ స్టార్ కృష్ణ (Krishna)కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన మ‌హేష్ బాబు (Mahesh Babu)

Updated on May 31, 2022 04:09 PM IST
సూప‌ర్ స్టార్ కృష్ణ (Krishna) 79 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుని 80 వ సంవ‌త్స‌రంలోకి అడుగు పెడుతున్నారు. త‌న తండ్రి పుట్టిన రోజు సంద‌ర్భంగా మ‌హేష్ బాబు సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు.
సూప‌ర్ స్టార్ కృష్ణ (Krishna) 79 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుని 80 వ సంవ‌త్స‌రంలోకి అడుగు పెడుతున్నారు. త‌న తండ్రి పుట్టిన రోజు సంద‌ర్భంగా మ‌హేష్ బాబు సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు.

టాలీవుడ్‌లో సంచ‌ల‌న విజ‌యాలు సాధించిన సీనియ‌ర్ హీరో సూప‌ర్ స్టార్ కృష్ణ (Krishna). జేమ్స్ బాండ్ చిత్రాల‌ను తెలుగు సినిమా ఇండ్ర‌స్ట్రీలో బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధించేలా చేసిన‌ తొలి త‌రం హీరో సూప‌ర్ స్టార్ కృష్ణ‌. సూప‌ర్ స్టార్ కృష్ణ 79 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుని 80 వ సంవ‌త్స‌రంలోకి అడుగు పెడుతున్నారు. త‌న తండ్రి పుట్టిన రోజు సంద‌ర్భంగా మ‌హేష్ బాబు సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు.

సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు మే 31. ఈ సంద‌ర్భంగా హ్యాపీ బ‌ర్త్ డే నాన్న‌ అంటూ మ‌హేష్ బాబు త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ పెట్టారు. నిజానికి త‌న తండ్రి లాంటి వ్య‌క్తి ఎవ‌రూ ఉండ‌రంటూ ఎమోష‌న‌ల్ అయ్యారు. ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటూ.. త‌న తండ్రి ఇలాంటి పుట్టిన రోజుల‌ను ఎన్నో జ‌రుపుకోవాల‌ని కోరుకున్నారు. దేవుడి ఆశీర్వాదం ఎప్పుడూ నాన్న‌కు ఉండాల‌ని.... ప్రేమతో మ‌హేష్ అంటూ ట్వీట్ చేశారు. 

కుమారుడు మ‌హేష్ బాబుతో పాటు కృష్ణ అభిమానులు కూడా సోష‌ల్ మీడియాలో విష‌స్ తెలుపుతున్నారు. టాలీవుడ్‌లో సూప‌ర్ స్టార్ కృష్ణ సాధించిన రికార్డులను గుర్తు చేసుకుంటున్నారు. #HBDLegendarySSK హ్యాష్ ట్యాగ్‌తో పోస్టులు పెడుతున్నారు. 30 ఏళ్ల న‌ట‌న జీవితంతో సూప‌ర్ స్టార్ కృష్ణ 317 సినిమాల్లో న‌టించారు. ఒక్క ఏడాదిలో కృష్ణ న‌టించిన 18 సినిమాలు రిలీజ్ అవ‌డం ఓ వండ‌ర్. సింహాస‌నం, అల్లూరి సీతారామరాజు వంటి ఎన్నో బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సినిమాలు చేసి ట్రేండ్ సృష్టించారు సూపర్ స్టార్ కృష్ణ (Krishna).

 

మహేష్ బాబు భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్ కూడా త‌న మామ‌య్య కృష్ణ‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి మావ‌య్య‌తో ఉన్న‌ అనుబంధం చాలా గొప్ప‌దంటూ న‌మ్ర‌తా ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. త‌మ‌కు త‌మ మావ‌య్య‌ ప్రేమ‌, ద‌య‌, ఆనందం పంచుతార‌న్నారు. త‌న భ‌ర్త మ‌హేష్ బాబుతో పాటు త‌మ‌ను తండ్రిలా చూసుకుంటార‌ని తెలిపారు. హ్యాపీ బ‌ర్త్ డే మావ‌య్య అంటూ కృష్ణ కోడలు న‌మ్ర‌తా శుభాకాంక్ష‌లు తెలిపారు. 

మ‌హేష్ బాబు త‌న తండ్రి పుట్టిన రోజున ఫ్యాన్స్‌కు స‌ప్రైజ్ ఇస్తార‌నే టాక్ వినిపిస్తుంది.  మహేష్, త్రివిక్ర‌మ్ కాంబోలో రాబోతున్న SSMB 28, రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో మహేష్ న‌టిస్తున్న‌ SSMB 29 సినిమాల‌ అప్ డేట్ కోసం అభిమనులు ప‌ట్ట‌లేని సంతోషంతో ఎదురుచూస్తున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!