సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu), త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చే మూడో సినిమా ‘అర్జునుడు’?

Updated on May 24, 2022 12:19 PM IST
త్రివిక్రమ్‌ శ్రీనివాస్, మహేష్‌బాబు
త్రివిక్రమ్‌ శ్రీనివాస్, మహేష్‌బాబు

సూపర్​స్టార్ మహేష్‌బాబు (Maheshbabu) ఇటీవల ‘సర్కారు వారి పాట’ సినిమాతో సూపర్‌‌హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు అందరి దృష్టి మహేష్‌ తర్వాత చేయబోయే సినిమాపై పడింది. SSMB 28గా పిలుచుకొనే ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై నుంచి ప్రారంభం కానున్నట్టు సమాచారం. చాలారోజుల కిందటే లాంచ్‌ అయిన ఈ సినిమాకి ప్రస్తుతం స్క్రిప్ట్‌ను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాకి డిఫరెంట్ టైటిల్ పెట్టే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దీనికి ‘అర్జునుడు’ అనే క్యాచీ టైటిల్‌ను పెట్టాలని అనుకుంటున్నట్టు సమాచారం. ‘అ’ అనే అక్షరం త్రివిక్రమ్‌కు సెంటిమెంట్ అనే సంగతి చాలా మందికి తెలిసిందే. ‘అతడు, అత్తారింటికి దారేది,  అ ఆ, అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురములో’ వంటి సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి.

అదే సెంటిమెంట్‌ను మహేశ్ సినిమాకు కూడా కొనసాగించాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడని టాక్.  దాదాపు ఇదే టైటిల్ ఖాయం చేయవచ్చని, మహేష్‌ తండ్రి కృష్ణ  పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ లోగోను మే 31న రివీల్ చేయబోతున్నారని తెలుస్తోంది. తన కుటుంబం కోసం ప్రత్యర్ధుల్ని హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ‘అర్జునుడు’ సినిమా కథాంశం అని ఇండస్ట్రీ టాక్.  ‘అతడు’ సినిమాకి ముందుగా ‘పార్ధు’ అనే టైటిల్ అనుకున్నా ఎందుకో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు త్రివిక్రమ్. తాజాగా పార్ధు అనే పదానికి పర్యాయపదంగా ఉన్న ‘అర్జునుడు’ టైటిల్‌ను మహేష్‌ చిత్రానికే ఫిక్స్ చేస్తుండడం విశేషం. 

‘సర్కారు వారి పాట’ సినిమాతో సమ్మర్‌ సెన్సేషనల్‌ సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు . ఆయన నటించిన ‘సర్కారువారి పాట’ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ సూపర్‌హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ‘పోకిరి’ తర్వాత అదే స్థాయిలో మహేష్‌ నుంచి సినిమా రావడంతో సూపర్‌స్టార్‌ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీతో కలిసి మహేశ్‌బాబు విదేశాలకు వెళ్లాడు. కుటుంబంతో కలిసి యూరప్‌ ట్రిప్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

 ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్‌ పూర్తైన వెంటనే మహేష్‌.. కుటుంబంతో కలిసి కొన్నిరోజులపాటు ప్యారిస్‌ వెళ్లి వచ్చాడు. ఆ టూర్‌ ముగించుకుని వచ్చి సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు మహేష్. సినిమా రిలీజ్‌ అయ్యి సక్సెస్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి ఫ్యామిలీతో టూర్‌‌ వెళ్లాడు. దీంతో ‘వచ్చారు.. ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు.. మళ్లీ వెళ్లారు’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ టూర్‌ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మహేష్‌ (MaheshBabu).  తన తదుపరి సినిమా పనుల్లో బిజీ కానున్నట్లు సమాచారం.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!