గూగుల్‌లో ఆర్ఆర్ఆర్ (RRR) అని టైప్ చేస్తే ఆ సర్‌ప్రైజ్ ఏంటో మీకే తెలుస్తుంది!!!
టాలీవుడ్ సినిమా 'ఆర్ఆర్ఆర్' (RRR) కు గూగుల్ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం సినిమా వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టి ప్రపంచ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు ప్రపంచ స్థాయిలో ఫాలోయింగ్ పెరిగింది. అంతేకాదు ప్రపంచ స్థాయి అవార్డులు కూడా ఆర్ఆర్ఆర్‌ను వరిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ ఇన్ని రికార్డులు సృష్టించడంతో గూగుల్ ఈ సినిమాకు ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చింది. ఆ వివరాలు..
గూగుల్‌లో 'ఆర్ఆర్ఆర్' హల్‌చల్
'ఆర్ఆర్ఆర్' (RRR) రిలీజ్ అయిన నాలుగు నెలలు దాటింది. ఈ సినిమా థియేటర్లు, ఓటీటీ అనే తేడా లేకుండా రికార్డులు మీద రికార్డులు సృష్టిస్తూనే ఉంది. పలు రికార్డులు సాధించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి గూగుల్ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా గురించి కొన్ని కోట్ల సార్లు కొన్ని కోట్ల మంది గూగుల్‌లో సెర్చ్ చేశారట. ఆ విషయాన్ని తెలుసుకున్న గూగుల్ చిత్ర యూనిట్‌కు ఓ మంచి గిఫ్ట్ అందించింది.
ట్రిపుల్ ఆర్ అని గూగుల్‌లో టైప్ చేస్తే ఓ బైక్, ఓ గుర్రం కనిపిస్తాయి. అంతేకాదు రామ్ చరణ్, ఎన్టీఆర్‌ను గుర్తుకు తెచ్చేలే అవి అటు ఇటు కదులుతూ ఉంటాయి. ఇలా గూగుల్ 'ఆర్ఆర్ఆర్' చిత్ర యూనిట్‌కు ఓ మంచి బహుమతి ఇచ్చింది.
గూగుల్‌కు థ్యాంక్యూ - ఆర్ఆర్ఆర్ మేకర్స్
'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాలో రామ్ చరణ్ ఎక్కువగా గుర్రంపైన కనిపిస్తారు. అలాగే ఎన్టీఆర్ బైక్‌పైన వెళ్తుంటారు. వీరిద్దరికి సంబంధించిన సీన్లు కూడా హైలెట్‌గా నిలిచాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని గూగుల్ కొత్త ఐడియా క్రియేట్ చేసింది. గూగుల్ తల్లి ఇచ్చిన సర్‌ప్రైజ్‌తో చిత్ర యూనిట్ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.
గూగుల్‌కు కృతజ్ఞతలు తెలిపింది. 'ఆర్ఆర్ఆర్' చిత్ర యూనిట్ గూగుల్ ఇచ్చిన గిప్ట్‌ను అందరికీ తెలియజేయనుంది. గూగుల్‌లో 'ఆర్ఆర్ఆర్' అని సెర్చ్ చేసి స్క్రీన్ షాట్ లేదా వీడియో తీసుకుని RRR Take Over హ్యాష్ ట్యాగ్‌తో పోస్టు చేయమని ప్రేక్షకులను కోరింది.
'ఆర్ఆర్ఆర్' సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటించి మెప్పించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1100 కోట్లను రాబట్టింది. హాలీవుడ్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగణ్, శ్రియా కీలక పాత్రల్లో కనిపించారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని డీవీవీ మూవీస్ పతాకంపై డీవీవీ దానయ్య సినిమా నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
Read More: ప్రపంచ సినీ వేడుకలకు 'రాజమౌళి' (SS Rajamouli).. అమెరికా మాజీ అధ్యక్షుడి భార్యతో భేటీ !