‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సినిమాపై వివాదం.. మణిరత్నం (ManiRatnam), చియాన్‌ విక్రమ్‌ (Vikram)కు లీగల్ నోటీసులు

Updated on Jul 19, 2022 01:46 AM IST
చియాన్ విక్రమ్, పొన్నియిన్ సెల్వన్ సినిమా పోస్టర్, మణిరత్నం (Mani Ratnam)
చియాన్ విక్రమ్, పొన్నియిన్ సెల్వన్ సినిమా పోస్టర్, మణిరత్నం (Mani Ratnam)

చాలా సంవత్సరాల తర్వాత మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబరు 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఇటీవల విడుదల చేసిన టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది. మరోవైపు ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సినిమా వివాదాల్లో చిక్కుకుంటోంది.

చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలకు ఎదురవుతున్న సమస్యలే ఈ సినిమాకు కూడా ఎదురవుతున్నాయి. చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ సెల్వన్‌ అనే లాయర్.. దర్శకుడు మణిరత్నం, ఆదిత్య కరికాలన్‌ పాత్ర పోషిస్తున్న చియాన్ విక్రమ్‌లకు లీగల్‌ నోటీసులు పంపించారు.

ఆదిత్య కరికాలన్‌ పాత్ర గురించి ప్రత్యేకంగా నోటీసుల్లో ప్రస్తావించారని తెలుస్తోంది. చిత్ర యూనిట్‌ విడుదల చేసిన పోస్టర్‌లో ఆదిత్య కరికాలన్‌ పాత్ర పోషించిన విక్రమ్‌ తిలకం పెట్టుకున్నారు. చోళులు ఎప్పుడూ తిలకం పెట్టుకున్నట్టుగా ఆధారాలు లేవని, డైరెక్టర్ మణిరత్నం చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారని న్యాయవాది సెల్వన్ ఆరోపించారు. ఈ నోటీసులపై మణిరత్నం,విక్రమ్‌ కానీ ఇప్పటివరకూ స్పందించలేదు.

పొన్నియిన్ సెల్వన్ సినిమా పోస్టర్

ప్రచారంలో జోరు పెంచిన చిత్ర యూనిట్..

మరోవైపు చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది. తాజాగా చోళ రాజుల గురించి, వారు సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ స్పెషల్‌ వీడియోను రిలీజ్ చేసింది. చరిత్రకారులు, పరిశోధకులు చోళ రాజుల వైభవం గురించి ఇందులో వివరించారు.

చోళుల కాలం తమిళనాడుకు స్వర్ణ యుగం అని చెప్పారు. నాగపట్నం ఓడరేవు ప్రధాన కేంద్రంగా సముద్రం ద్వారా వ్యాపారాన్ని కూడా చేశారని తెలిపారు. తమిళనాడులో ఇప్పుడు ఉన్న చాలా ఆలయాలు చోళులు నిర్మించినవేనని ఆ వీడియోలో పేర్కొన్నారు.

దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో క్లాసికల్ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సినిమాలో విక్రమ్‌ (Vikram), ఐశ్వర్యరాయ్, కార్తీ, త్రిష, జయం రవి, ప్రకాశ్‌ రాజ్‌, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ, ప్రభు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో  ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌, నటీనటుల పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.  

 Read More : ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్‌ కోసం ‘సలార్‌‌’ సినిమాలో హై ఆక్టేన్ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!