మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘పొన్నియిన్ సెల్వన్‌’ (Ponniyin Selvan) సినిమాలో ఒక్క పాటకు అంత మంది డ్యాన్సర్లా!

Updated on Jul 17, 2022 12:05 AM IST
‘పొన్నియిన్ సెల్వన్‌’ (Ponniyin Selvan) సినిమా పోస్టర్
‘పొన్నియిన్ సెల్వన్‌’ (Ponniyin Selvan) సినిమా పోస్టర్

క్లాసికల్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌ పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan). రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమాలోని మొదటి భాగాన్ని సెప్టెంబర్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్‌ ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలో సినిమా ఫస్ట్‌ లుక్ మోషన్ పోస్టర్‌‌తోపాటు కీలకపాత్రల్లో నటిస్తున్న నటీనటుల పోస్టర్లను విడుదల చేసింది చిత్ర యూనిట్.

చోళ రాజుల సామ్రాజ్యంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి 1955లో ఒక నవలను రచించారు. ఈ పుస్తకం ఆధారంగా సినిమా తెరకెక్కించాలని మణిరత్నం ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అయితే భారీ బడ్జెట్‌ సినిమా కావడం, ఎక్కువ మంది స్టార్లు సినిమాలో నటించడానికి అవసరం ఉండడంతోపాటు పలు కారణాలతో ఈ సినిమా చాలా కాలంగా పట్టాలెక్కలేదు. ఎట్టకేలకు పొన్నియిన్ సెల్వన్‌ సినిమాను మొదలు పెట్టారు మణిరత్నం.

‘పొన్నియిన్ సెల్వన్‌’ (Ponniyin Selvan) సినిమా పోస్టర్

ఫస్ట్‌ లుక్‌తో పెరిగిన అంచనాలు..

హిస్టారిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ సినిమాపై పెద్ద అప్‌డేట్‌ వచ్చింది. ఈ అప్‌డేట్‌ గురించి తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు. అదేంటంటే.. పొన్నియిన్ సెల్వన్ సినిమాలోని ఒక పాటను సుమారు 300 మంది డ్యాన్సర్లు నర్తించారట. అంతేకాదు ఈ పాటను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 రోజులపాటు చిత్రీకరించారని సమాచారం. ముంబై నుంచి ప్రత్యేకంగా 100 మంది డ్యాన్సర్లు కూడా ఈ పాట కోసం పనిచేశారని తెలుస్తోంది. కాగా, ఈ పాటను త్వరలోనే రిలీజ్‌ చేయనున్నట్టు సమాచారం.

ఇక, పొన్నియిన్ సెల్వన్ సినిమాలో చియాన్ విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు, టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. లైకా ప్రొడక్షన్స్‌ సంస్ధ నిర్మిస్తున్న పొన్నియిన్ సెల్వన్‌ (Ponniyin Selvan) సినిమాకు ఏఆర్ రెహమాన్‌ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్‌ 30న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్‌ కానుంది.  

Read More : మహానటి కీర్తి సురేష్‌కు (Keerthy Suresh) ఎవరి నటనంటే ఇష్టమో తెలుసా? కీర్తి మనసులో మాట

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!