Ponniyin Selvan-1: 'పొన్నియిన్ సెల్వ‌న్' సినిమా టికెట్ అంత పెట్టి కొనాల్సిందేనా.. చోళ రాజ క‌థ‌కు డిమాండ్!

Updated on Sep 25, 2022 06:29 PM IST
హైద‌రాబాద్‌లోని ప్ర‌ధాన మ‌ల్టీప్లెక్స్‌ల‌లో రూ.295   'పొన్నియిన్ సెల్వ‌న్' (Ponniyin Selvan 1) ఒక్కో టికెట్ అమ్మ‌నున్నార‌ట‌.
హైద‌రాబాద్‌లోని ప్ర‌ధాన మ‌ల్టీప్లెక్స్‌ల‌లో రూ.295  'పొన్నియిన్ సెల్వ‌న్' (Ponniyin Selvan 1) ఒక్కో టికెట్ అమ్మ‌నున్నార‌ట‌.

ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే  'పొన్నియిన్ సెల్వ‌న్' (Ponniyin Selvan 1) చిత్రం ప్ర‌త్యేక‌మైంది. భార‌త‌దేశ చ‌రిత్ర గురించిన విశేషాల‌తో ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమాలో న‌టించిన వారంద‌రూ స్టార్ న‌టీన‌టులే. 'పొన్నియిన్ సెల్వ‌న్' సినిమా సెప్టెంబ‌ర్ 30న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. తెలంగాణ‌లోని మ‌ల్టీప్లెక్స్‌ల‌లో ఈ సినిమా టికెట్‌ల‌ను ఎక్కువ ధ‌ర‌కు అమ్మాల‌ని నిర్ణ‌యించార‌ట‌. 

మ‌ల్టీప్లెక్స్‌ల‌లో టికెట్ ధ‌ర ఎంతంటే
అత్యంత భారీ బ‌డ్జెట్‌తో  'పొన్నియిన్ సెల్వన్ 1' (Ponniyin Selvan 1) సినిమాను చిత్రీక‌రించారు. కోలీవుడ్‌తో పాటు ఇండియా సినిమా రంగంలోనే 'పొన్నియిన్ సెల్వ‌న్' రికార్డులు సృష్టిస్తుంద‌ని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమా టికెట్ ధ‌ర‌ రూ.295 ఉండ‌నుంద‌నే విష‌యం ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

హైద‌రాబాద్‌లోని ప్ర‌ధాన మ‌ల్టీప్లెక్స్‌ల‌లో రూ.295 ఒక్కో టికెట్ అమ్మ‌నున్నార‌ట‌. ప్ర‌భుత్వం అనుమ‌తులు తీసుకునే ఈ ధ‌ర నిర్ణ‌యించార‌ని స‌మాచారం. ఈ మ‌ధ్య‌కాలంలో తెలుగు సినిమాలు ఏవీ ఇంత ఎక్కువ ధ‌ర‌ను ప్ర‌క‌టించ‌లేదు. భార‌త దేశ చరిత్ర తెలిపే 'పొన్నియ‌న్ సెల్వ‌న్' చిత్రం మ‌ల్టీప్లెక్స్‌ల‌లో చూడాలంటే ప్రేక్ష‌కులు ఎక్కువ డ‌బ్బులు ఖ‌ర్చు చేయాల్సిందే. 

హైద‌రాబాద్‌లోని ప్ర‌ధాన మ‌ల్టీప్లెక్స్‌ల‌లో రూ.295   'పొన్నియిన్ సెల్వ‌న్' (Ponniyin Selvan 1) ఒక్కో టికెట్ అమ్మ‌నున్నార‌ట‌.

'పొన్నియిన్ సెల్వన్‌'  సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్ పై మణిరత్నం, సుభాష్ కరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఓ ప్రాచీన న‌వ‌ల ఆధారంగా 'పొన్నియిన్ సెల్వ‌న్ ' తెర‌కెక్కుతోంది. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ, కన్నడం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. 

Read More: Ponniyin Selvan 1: 'పొన్నియిన్ సెల్వ‌న్' లాంటి క‌థ‌లు అనేకం.. భార‌త‌దేశ చ‌రిత్ర గొప్ప‌ది - చియాన్ విక్ర‌మ్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!