Cobra: కోబ్రాగా వ‌స్తున్న విక్ర‌మ్ (Vikram) .. ప్ర‌తీ స‌మ‌స్య‌ ప‌రిష్కారానికి ఓ లెక్క ఉంది !

Updated on Jun 25, 2022 02:47 PM IST
 విక్ర‌మ్ (Vikram) న‌టించిన‌ కోబ్రా సినిమా ఆగ‌స్టు 11న ప్ర‌పంచ వ్యాప్తంగా త‌మిళ్, తెలుగు భాష‌ల్లో రిలీజ్ కానుంది. 
విక్ర‌మ్ (Vikram) న‌టించిన‌ కోబ్రా సినిమా ఆగ‌స్టు 11న ప్ర‌పంచ వ్యాప్తంగా త‌మిళ్, తెలుగు భాష‌ల్లో రిలీజ్ కానుంది. 

టాలీవుడ్‌లో త‌మిళ హీరో విక్ర‌మ్ (Vikram) న‌ట‌న‌కు మంచి గుర్తింపు ఉంది. విక్ర‌మ్ న‌టించిన సినిమాల‌న్నింటినీ తెలుగులోనూ డ‌బ్ చేస్తారు. శివపుత్రుడు,అపరిచితుడు, ఐ లాంటి సినిమాలను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రించారు. ప్ర‌స్తుతం విక్ర‌మ్ కోబ్రా సినిమాలో న‌టిస్తున్నారు. దక్షిణాదిలో విక్రమ్‌కు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే. 

విక్ర‌మ్ (Vikram) సినిమాతో క‌మ‌ల్ హాస‌న్ త‌మిళ ఇండ‌స్ట్రీకి భారీ హిట్ ఇచ్చారు. హీరో విక్ర‌మ్ కూడా కోబ్రా సినిమాతో భారీ హిట్ సాధించాల‌నుకుంటున్నారు. చియాన్ విక్ర‌మ్‌కు తెలుగు హీరోల‌కు ఉన్న ఫాలోయింగ్ ఉంది. విక్ర‌మ్ క‌రోనా టైంలో మ‌హాన్ చిత్రాన్ని అమెజాన్‌లో విడుద‌ల చేశారు. కోబ్రా చిత్రం అజ‌య్ జ్ఞానముత్తు ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌ల కానుంది. 

విక్ర‌మ్‌(Vikram)కు జోడిగా కేజీఎఫ్ హీరోయిన్
కోబ్రా మూవీ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతుంది. ఈ చిత్రంలో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏఆర్ రెహ‌మాన్ కోబ్రా చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్డూడియోస్ ప‌తాకంపై ఎస్‌.ఎస్‌. ల‌లిత్ కుమార్ అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా నిర్మించారు. అ

త్యంత భారీ బ‌డ్జెట్‌తో కోబ్రా సినిమాను నిర్మించారు. ప్ర‌ముఖ దిగ్గ‌జ క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ ప్ర‌తినాయ‌కుడి పాత్రలో కోబ్రాలో క‌నిపించ‌నున్నారు.కోబ్రా సినిమా ఆగ‌స్టు 11న ప్ర‌పంచ వ్యాప్తంగా త‌మిళ్, తెలుగు భాష‌ల్లో రిలీజ్ కానుంది. 

Read More: Vikram 2 ( విక్రమ్ 2) : టాప్ 10 ఆసక్తికరమైన విషయాలు.. లోకేష్ కనగరాజ్ ప్లానింగ్ చూస్తే మైండ్ బ్లాక్ !

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!