పొన్నియ‌న్ సెల్వ‌న్ 1 (Ponniyin Selvan 1) తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్.. హైద‌రాబాద్‌ వ‌స్తున్న చోళ రాజులు

Updated on Sep 21, 2022 06:21 PM IST
 'పొన్నియిన్ సెల్వ‌న్ 1' (Ponniyin Selvan 1) సినిమా తెలుగు వెర్ష‌న్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నుంది.
'పొన్నియిన్ సెల్వ‌న్ 1' (Ponniyin Selvan 1) సినిమా తెలుగు వెర్ష‌న్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నుంది.

త‌మిళ స్టార్ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం  'పొన్నియిన్ సెల్వన్ 1' (Ponniyin Selvan 1). ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ల‌ను మ‌ణిర‌త్నం కొత్త‌గా నిర్వ‌హించ‌నున్నారు. ఇప్ప‌టికే త‌మిళ‌నాడులో ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్ హాస‌న్ ఈ సినిమా ట్రైల‌ర్‌ రిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అలాగే ప్రీ రిలీజ్ వేడుకను కూడా ఘ‌నంగా నిర్వ‌హించారు. 'పొన్నియిన్ సెల్వ‌న్ 1' సినిమా తెలుగు వెర్ష‌న్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో సెప్టెంబ‌ర్ 23 తేదీన జేఆర్‌సీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో  సాయంత్రం 6 గంట‌ల‌కు జ‌ర‌గ‌నుంది.

అల‌రిస్తున్న పాట‌లు

'పొన్నియిన్ సెల్వన్ 1' (Ponniyin Selvan 1) చిత్రాన్ని రెండు పార్టులుగా మ‌ణిర‌త్నం తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. అలాగే పాటలు కూడా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాయి. మూడేళ్లుగా త‌మిళ్ సినిమా రంగంలో భారీ విజ‌యం సాధించిన సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. 'పొన్నియిన్ సెల్వ‌న్ 1'తో త‌మిళ సినీ రంగానికి పూర్వ వైభ‌వం తీసుకురావాల‌ని మ‌ణిర‌త్నం భావిస్తున్నారని స‌మాచారం. 

9 రోజుల్లో రిలీజ్

పాన్ ఇండియా లెవ‌ల్‌లో జానపద చిత్రం 'పొన్నియిన్ సెల్వన్ 1' (Ponniyin Selvan 1) తెరకెక్కింది. ఈ సినిమా మొద‌టి భాగం ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 30న రిలీజ్ కానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో 'పొన్నియిన్ సెల్వ‌న్ 1' సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌తో కలిసి, మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్‌పై మ‌ణిర‌త్నం స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించారు. 'పొన్నియిన్ సెల్వ‌న్ 1' చిత్రంలో చియాన్ విక్ర‌మ్‌, కార్తి, జయం రవి, ఐశ్వ‌ర్య‌రాయ్‌, త్రిష, బాబీ సింహ వంటి ప్ర‌ముఖులు న‌టించారు.

Read More: Ponniyin Selvan 1: 'పొన్నియిన్ సెల్వన్ 1' ట్రైల‌ర్ కోసం ఏక‌మైన కోలీవుడ్.. చోళ రాజుల పాల‌న‌పై మ‌ణిర‌త్నం సినిమా

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!